కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 మెట్లు (పార్ట్ 3)

కోపాన్ని అధిగమించడం – విజయానికి 5 మెట్లు (పార్ట్ 3)

  1. “ నేను రైట్ “ అనే భావనను విడిచిపెట్టండి – కోపంతో నిండిన సంబంధాలకు అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి “ నేను రైట్ “ మరియు ఇతర వ్యక్తి తప్పు అనే అహం. ఎంత అహం ఉంటే, అంత కోపం ఎక్కువ అవుతుంది. కుటుంబంలో లేదా కార్యాలయంలో చాలా మూడీగా ఉండే వ్యక్తులు, ఎల్లప్పుడూ ఇతరులపై అరుస్తూ మరియు వారిని తప్పుగా చూసే వ్యక్తులు చాలా అహంభావంతో ఉంటారు. అలాగే, కోపం యొక్క చాలా సాధారణ మరియు నెగెటివ్ ఛాయ వ్యంగ్యం.  వ్యక్తుల చర్యలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం మరియు నేను అనుకున్నది మరియు చేసేది ఉత్తమమైనది మరియు సరైనది అని ఎల్లప్పుడూ ఆలోచించడం. మరోవైపు, అహాన్ని విడిచి పెట్టె వ్యక్తి,  ఎదుటి వ్యక్తి నిజంగా కొన్ని తప్పులు చేసినప్పటికీ, పరస్పర చర్యలలో చాలా మధురంగా మరియు దయతో ఉంటాడు. ఇతరులను నిర్దోషులుగా చూడడానికి మరియు అతిగా విమర్శించకుండా ఉండటానికి, మనం ప్రతిరోజూ కలిసే ప్రతి వ్యక్తిలో కనీసం ఒక ప్రత్యేకతను చూడటం చాలా సులభమైన అభ్యాసం. ఈ రకమైన పాజిటివ్ దృష్టి మనల్ని కోపం నుండి విముక్తి చేస్తుంది, చాలా నెగెటివ్ పరిస్థితులలో కూడా మనం వ్యక్తులను పాజిటివ్ గా చూస్తాము మరియు వారి లోపాలు, బలహీనతలపై దృష్టి పెట్టము.

5. కోపం లేకుండా ఉండటానికి ఒత్తిడి లేకుండా ఉండండి – జీవితం అనేక రకాల నెగెటివ్ పరిస్థితులు మరియు మలుపులతో నిండి ఉంటుంది, ఇది మనల్ని కొన్ని సమయాల్లో అస్థిరంగా మరియు ఒత్తిడికి గురి చేస్తుంది. ఒత్తిడి అనేది ప్రధానంగా మన మనస్సులో ఉన్న అనేక ప్రశ్నలు, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు మరియు ఎలా అనే ప్రశ్నల వల్ల కలుగుతుంది. మనస్సు ఎంత ప్రశ్నలతో మరియు పరిష్కారం లేని సమస్యలతో నిండి ఉంటుందో, అంతగా మనస్సు విషపూరితమైన మాటలు మరియు చర్యల రూపంలో ప్రతిస్పందిస్తుంది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కానీ వాటితో మనకున్న అటాచ్మెంట్ మరియు అవి సరైన సమయంలో మరియు సరైన పద్ధతిలో పరిష్కారమయ్యే వరకు వేచి ఉండటంలో అసహనం కోపానికి దారి తీస్తుంది. చాలా సందర్భాలలో కోపం అనేది ఒక రకమైన బాటిల్ లో బంధించబడిన ఒత్తిడి, అది ఎప్పటికప్పుడు తెరుచుకుంటుంది. మెడిటేషన్ మరియు దాని ఫలితంగా పాజిటివ్ థింకింగ్ మనస్సు యొక్క ఒత్తిడిని తగ్గించే కొన్ని పద్ధతులు. కోపం నుండి విముక్తి అయితే ఒత్తిడి నుండి స్వేచ్ఛను పొందినట్టే.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »