21st march soul sustenance telugu

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 2)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే వివిధ అంశాలు:

ఆంతరిక మౌనము మరియు ఏకాగ్రతా శక్తి – మౌనము ఒక శక్తి. మనసులో ఎంత తక్కువ ఆలోచనలు వస్తాయో అంత ఎక్కువ శాంతిగా, పాజిటివ్‌గా, ఏకాగ్రంగా ఆ వ్యక్తి ఉన్నాడు అని అర్థం. పాత్ర విజయానికి సూక్ష్మ స్థాయిలో మనసు మౌనం ఎక్కువ దోహదపడుతుంది. వివిధ పాత్రలను పోషించే సమయంలో నేను ఎదుర్కోవలసి వచ్చే ఆటంకాలు, నెగిటివ్ పరిస్థితులు నా మౌనాన్ని పరీక్షిస్తాయి. అటువంటి పరిస్థితులలో కూడా నన్ను నేను ప్రశాంతంగా పెట్టుకుని, ఎంతోకాలం నుండి ఆంతరిక శాంతి ద్వారా ఏర్పరచుకున్న మనసు మౌనం, సానుకూలత అన్నీ కలిసి నా భౌతిక పాత్రపై మరియు వివిధ పనులలో నేను సాధించే విజయంపై ప్రభావం చూపుతాయి.

ఆంతరిక మరియు బాహ్య నిశ్చింతత, సంతోషము మరియు సంతృష్టతల శక్తి –  సంతోషం కూడా ఒక శక్తే. ఆంతరిక సంతోషమే కాదు, ఇతరులను కలిసినప్పుడు నా కళ్ళతో, ముఖంతో, మాటలతో, చేతలతో పూర్తి తేలికదనాన్ని, ఉత్సాహాన్ని మొదలైనవాటిని అనుభూతి చేయించడం కూడా సంతోషమే. నాతో నేను మరియు ఇతరులతో నేను సంతుష్టంగా ఉన్నాను, ఇతరులు కూడా నాతో సంతుష్టంగా ఉన్నారు అన్న భరోసా నా పాత్రలో సానుకూల శక్తిని కలిగించి  అనేక సానుకూల విధాలుగా సహాయపడుతుంది. పదే పదే అసంతృప్తికి, అసంతోషానికి లోనవుతుంటే, ఆ లోటు నా లోపల ఉండవచ్చు, నా సంబంధాలలో ఉండవచ్చు, ఈ ఖాళీతనము నా విజయంపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది.

రేపటి సందేశంలో ఆత్మ శక్తిని దోహదపరిచే మరిన్ని అంశాలను చర్చించుకుందాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »