భగవంతునికి ఉత్తరాలు రాయడం

భగవంతునికి ఉత్తరాలు రాయడం

ఆధ్యాత్మికత మార్గంలో చాలా మంచి అభ్యాసం ఏమిటంటే, రాత్రి నిద్రపోయే ముందు లేదా మరేదైనా సమయంలో మీ రోజువారీ కార్యకలాపాల గురించి భగవంతునికి వ్రాయడం. భగవంతుడు ఒక సుందరమైన మరియు ఉదారభావం గల సర్వోన్నత తల్లి లేక తండ్రి, వారు ఎల్లప్పుడూ మనలను రక్షిస్తారు మరియు రోజులో ప్రతి క్షణం మనకు సహాయం చేస్తారు . భగవంతుడు జ్ఞాన సాగరుడని మరియు మన జీవితంలో ఏమి జరుగుతుందో అతనికి ముందే తెలుసు అని చాలా మంది వ్యక్తులు  కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆయనకు ఏదైనా ఎందుకు చెప్పాలి? మనకు భగవంతునితో లోతైన సంబంధం ఉంది. ఈ సంబంధానికి ఒక ముఖ్యమైన ప్రతిస్పందనగా   మరియు మనం భగవంతుడిని చాలా ప్రేమిస్తున్నాము మరియు గౌరవిస్తాము కాబట్టి, గడిచిన రోజు మరియు మరుసటి రోజు గురించి కొంచెం 5-6 లైన్ ల వివరణ ఇవ్వడం మంచిది.  తద్వారా వారు తన జ్ఞానం మరియు అత్యున్నతమైన తెలివితో మనలను గైడ్ చేస్తారు. అలాంటి ఉత్తరం ఎలా రాయాలి? 5 ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాము. 

  1. మీరు ఒక వ్యక్తిగా ఎలా అభివృద్ధి చెందుతున్నారనే దాని గురించి భగవంతునికి స్పష్టంగా చెప్పండి  – మీ బలహీనతలు మరియు బలాలు ఏమిటి, మీరు మీ బలహీనతలను ఎలా తొలగించుకోవాలి మరియు మీ బలాన్ని ఎలా మరింత మెరుగుపరుచుకోవాలి అని వారిని  అడగండి?
  2. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నాయో భగవంతునికి చెప్పండి –  రెండూ,  పాజిటివ్ మరియు నెగిటివ్. పాజిటివ్ పరిస్థితులు మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి మరియు నెగిటివ్ పరిస్థితులను ఎలా అధిగమించవచ్చు అని వారిని అడగండి. 
  3. అలాగే, ఆధ్యాత్మిక మార్గంలో మీ అనుభవాలను భగవంతునితో పంచుకోండి మరియు వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని మరింత ఆస్వాదించడానికి వారి శక్తి  మరియు సలహాను  అడగండి.
  4. మీ జీవితంలోని విభిన్న సంబంధాల గురించి భగవంతునికి ఒక సారి చెప్పండి. వాటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చు, మీ సన్నిహితులను భగవంతునితో ఎలా కనెక్ట్ చేయవచ్చు మరియు వారి జీవితాలను మరింత ఆధ్యాత్మికంగా, అందంగా మార్చవచ్చు అనే దానిపై వారి అభిప్రాయాన్ని అడగండి.
  5. చివరగా, మీ లేఖలలో ఎల్లప్పుడూ భగవంతునికి మీ ప్రేమను వ్యక్తపరచండి మరియు అతనితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ వ్యక్తపరిస్తే, మీరు వారి  ప్రేమను తిరిగి అంత పొందుతారు మరియు వారి  ఆధ్యాత్మిక పాలన మిమ్మల్ని మరింత పరిపూర్ణ మరియు పాజిటివ్ వ్యక్తిగా మారుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »