22nd april soul sustenance telugu

మీ ఉదయం సమయం యొక్క క్వాలిటి మార్చడం

మన మనసుకు మరియు శరీరానికి పోషణ కోసం శక్తివంతమైన ఉదయపు దినచర్యను పెంపొందించుకోవడమే మనకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతులు. ఉదయాన్ని తాజాగా ప్రారంభించడం, ఆ రోజు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని, ఆ రోజు ఒక బహుమానంలా ఉండేలా సెట్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం. సాధారణంగా మీ ఉదయం ఎలా ప్రారంభమవుతుంది? మీరు మీ ఇమెయిల్‌లను అనేక  సార్లు చెక్ చేసి, ఆ రోజు హడావుడిగా మొదలుపెడతారా? మీరు నిద్రలేవగానే ఫోన్‌ని పట్టుకుని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ విషయం మీకు తెలియకముందే, మీరు ఆలస్యం కావచ్చు. ఎందుకంటే అలా చేయడం వలన మనస్సు అల్లకల్లోలంగా మారుతుంది, శరీరం ఒత్తిడికి గురవుతుంది. మన మనస్సు మన పాత్రలు మరియు బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన మొదటి బాధ్యత. భగవంతునికి, మన మనస్సుకు మరియు శరీరానికి, వ్యక్తులకు, మనం ఉపయోగించే వస్తువులకు మరియు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మనం అత్యధిక శక్తివంతమైన సంకల్పాలను చెయ్యటం ప్రారంభించవచ్చు. రోజంతా సంతోషంగా ఉండడాన్ని విజువలైజ్ చేయడంతో పాటు కొన్ని నిమిషాల శ్రేష్ట సంకల్పాలతో మీ మనస్సుకు పోషణను ఇవ్వండి. కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి, ఆపై కొన్ని నిమిషాల పాటు జీవితాన్ని మెరుగు పరిచే సందేశాలను చదవండి. ఇలాంటి కార్యకలాపాలు మన ఆంతరిక బ్యాటరీని ఛార్జ్ చేసి రోజంతా ఆనందం మరియు శాంతి యొక్క అనుభూతిలో ఉండడానికి మనకు సహాయపడతాయి. క్రమపద్ధతిలో రోజంతటి కోసం ఉదయపు అలవాట్లను అనుసరించడానికి స్వీయ-క్రమశిక్షణను కలిగి ఉందాం. 

శాంతి మరియు సైలెన్స్ మీ సహజ సంస్కారాలు అని ప్రతి ఉదయం మీకు మీరు గుర్తు చేసుకోండి. ఖచ్చితమైన దినచర్యతో ప్రారంభిస్తే ప్రతి రోజు అందంగా ఉంటుంది , ఎందుకంటే మీరు మీ ఆనందం మరియు విజయం కోసం మిమ్మల్ని మీరు తయారు చేసు కుంటున్నారు. ప్రతిరోజూ మీ ఉదయపు అలవాట్లను ఖచ్చితంగా అనుసరించండి. తాజా అనుభూతితో మేల్కోండి. మీ మనస్సు మరియు శరీరం బాగా విశ్రాంతి పొందాయి. మీ శరీరంలోని ప్రతి కణాన్ని సక్రియం చేస్తూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి లేదా నడవండి. ఇది రోజంతా మీ అన్ని కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సుప్రీం పవర్ హౌస్ అయిన భగవంతునితో కనెక్ట్ అవ్వడం ద్వారా మిమ్మల్ని మీరు, మీ మనస్సును ఛార్జ్ చేసుకోవడానికి 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ప్రతి సన్నివేశంలో ఉపయోగించబడేలా శాంతి, ఆనందం మరియు శక్తి యొక్క మీ అంతరిక శక్తులను ఎమర్జ్ చేసుకోండి. అలాగే రోజులో మీ కోసం మీరు ప్లాన్ చేసుకోండి, మీలో ఉన్న ఏదైనా చెడు సంస్కారం మార్చుకోవడం, ఒకరిని క్షమించడం , గతాన్ని మర్చిపోవడం , ఎవరితోనైనా మంచిగా ఉండడం లాంటివి ఎంచుకొని, నిర్ణయించుకొని,  అమలు చేయండి. మీ మనస్సు స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ఆలోచనలను రూపొందించడంలో సహాయపడటానికి 15 నిమిషాల పాటు ఉత్తేజకరమైన, స్పూర్తినిచ్చే సందేశాలను చదవండి. మొదటి గంట పాటు సోషల్ మీడియా లేదా ఇమెయిల్ చెక్ చేయవద్దు, వార్తాపత్రికలను చదవవద్దు లేదా వార్తలను చూడవద్దు. మీ ఉదయం సమయం మీ సమయం, మీ పోషణ కోసం రిజర్వ్ చేయబడింది. రోజులో మీ మానసిక స్థితి, శక్తి, వైఖరి మరియు సమర్థతకు ఇవన్నీ చేసే భారీ మార్పును మీరు చూస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »