మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి

మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి

మనపై మనకు అవగాహన కలిగి ఉండటం, మనలోని బలాలు మరియు బలహీనతలు తెలిసి ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ అవగాహన ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవ్వాలో చెబుతుంది, మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నామో, మన వ్యక్తిత్వంలో ఎక్కడ మార్పు తీసుకురావాలో తెలుస్తుంది. కానీ తరచుగా, మనలోని బలాలు మరియు బలహీనతలను తెలుసుకోవడానికి మనం కష్టపడుతుంటాము. మన సన్నిహితులలోగానీ, మనకు అంతగా పరిచయం లేని వారిలోగానీ, మనకు నచ్చనివారిలోగానీ ఉన్న మంచిని లేక చెడును మాత్రం త్వరగా పసిగట్టేస్తాం.

  1.     ఈ ప్రపంచం ఇతరులను త్వరగా జడ్జ్ చేసేస్తుంది, త్వరగా అంచనా వేసేస్తుంది, కానీ మనలోని బలాలు, బలహీనతలను పరిశీలించుకునే చిన్న పని మాత్రం మనం ఎంతవరకు చేస్తున్నాము? మీలోని సుగుణాలు ఏమిటో మీకు తెలుసా? అవి మీ ఉన్నతికి ఎలా ఉపయోగపడతాయో ఎప్పుడైనా మీ జీవితంలో ప్రయోగించారా?
  2.   మనల్ని చూసుకోవడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించము. ఈరోజు, మనలోని ఏదైనా 5 బలాలు, బలహీనతలను చెప్పమంటే మనకు చాలా సమయం పడుతుంది, కానీ కుటుంబ సభ్యులు మరియి స్నేహితుల గురించి మాత్రం వెంటనే చెప్పేస్తాము. ఇతరుల గురించి తెలుసుకోవడము, వారు మారాలి అనుకోవడం వలన ఏమీ లాభం లేదు, అది మన చేతుల్లో లేని విషయం. మనం మార్చగల ఏకైక వ్యక్తి – స్వయం.
  3.   రోజూ మీతో మీరు 5 నిమిషాలు గడపండి. మీకు అనువుగా ఉండి, సరైన శక్తిని వ్యాప్తి చేస్తూ చక్కని ఫలితాలను ఇచ్చే మీ ఆలోచనలను, ప్రవర్తనను గమనించండి. ఇవే మీ బలాలు. ఈ మీ గుణాన్ని పెంచి పోషించండి. ఇందుకు భిన్నంగా, అసౌకర్యంగా ఉండేది ఏదైనా బలహీనత అవుతుంది. దానిని అధిగమించడానికి మీరు ప్రయత్నించండి.
  4.   మీతో మీరు చక్కని బంధాన్ని పెంచుకోండి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోవడం ద్వారా మీరు నిత్యం ఎదుగుతూనే ఉంటారు. మీకు మీరే గుర్తు తెప్పించుకోండి – నేనేమిటో నాకు తెలుసు. నాలోని మంచి గుణాలను సర్వదా, సర్వులతో ఉపయోగిస్తూ ఉంటాను. నాలోని బలహీనతలు నాకు తెలుసు, మార్పుకు నేను సిద్ధంగా ఉన్నాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »