HI

22st feb soul sustenance telugu

వాదనల నుండి ఉపసంహరించుకోండి ... ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి

మనందరి సంస్కారాలు మరియు అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి, రోజువారీ కార్యాలలో అభిప్రాయాల బేధాలు తలెత్తుతాయి. అలాంటి సమయాల్లో మనం మన అభిప్రాయాన్ని సరి అయినదిగా నిరూపించుకోవాలనే అహంభావంతో ఎదుటి వ్యక్తిని విమర్శిస్తే, చర్చ వాదనగా మారుతుంది. కానీ మనం మానసికంగా ఆ చర్చ నుండి వైదొలగి, స్థిరంగా ఉండి, ఆపై మాట్లాడితే , మనకు విభేదాలు ఉన్నప్పటికీ సామరస్యమైన సంభాషణ జరుగుతుంది . మీరు ఎవరితోనైనా విభేదించినప్పుడు ప్రశాంతమైన చర్చలకు మీ లిమిట్ ఎంత? మీ అహం పెరిగి మీ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి మీరు వాదిస్తారా? అలాగే, సుదీర్ఘ వాదనలు విలువైనవిగా భావిస్తున్నారా? మన మాట ఇతరులు వినడం ముఖ్యమే. కానీ ఆరోగ్యకరమైన చర్చల కోసం మనం విరామం తీసుకొని, పరిస్థితిని అర్థం చేసుకొని, ప్రతిస్పందించి మాట్లాడటం అవసరం. మనసులో ఎదుట వారు తప్పు అని తేల్చకుండా వారి అభిప్రాయాన్ని మనం వినాలి. వాదించడం కంటే వినయంగా ఉండటంలో ఎక్కువ శక్తి ఉంది. వినయం మన ఎమోషన్స్ ను అదుపులో ఉంచుతుంది. వినయం లేకపోతే సరి అయిన వాటికన్నా మన అభిప్రాయాలు సరి అయినవిగా మనం పవర్ గేమ్ ఆడుతాము. వాదనలు అహం నుండి పుట్టి అవసరమైన సంభాషణను నిరోధిస్తాయి. ప్రతి ఒక్కరి అభిప్రాయం వారికి సరైనదే అని మన మనస్సులో అండర్లైన్ చేసుకోవాలి. ఇది మనము ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ మన అభిప్రాయాన్ని ప్రశాంతంగా చెప్పడానికి, స్థిరత్వంతో విభేదాలను అంగీకరించడానికి మనకు సహాయపడుతుంది.

రోజంతా, వ్యక్తులతో కలిసి జీవిస్తూ , వారితో కలిసి పనిచేస్తూ, అపరిచితులను కలుస్తూ కూడా మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోండి. అభిప్రాయ భేదాలు ఉంటే మీ అభిప్రాయాన్ని స్థిరత్వంతో ఉంచండి. మీ అభిప్రాయం నుండి వేరు అయ్యి వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోండి . మీరు అప్పటికీ వారి అభిప్రాయంతో సంతృప్తి చెందకపోతే, మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఒప్పుకొని స్వయం పట్ల గౌరవంగా మరియు ఎదుట వారిని గౌరవంతో అంగీకరించండి. వారు వారి సంస్కారాలు మరియు వారి అభిప్రాయాల ప్రకారం మాట్లాడతారని, మీరు మీ అభిప్రాయం ప్రకారం మాట్లాడతారని అర్థం చేసుకోండి. మీ ఇద్దరిలో ఎవరూ తప్పు కాదు, ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. తాబేలు దాని పెంకులోకి ప్రవేశించినట్టు ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సన్నివేశంలోని అనారోగ్య శక్తుల నుండి ఆంతరికంగా వైదొలగండి. ఇది ఒక వాదన లేదా సంఘర్షణగా మారనివ్వవద్దు. మీ అహాన్ని వాదించడానికి, మీ మాటే సరైనదని నిరూపించుకోవడానికి అనుమతించవద్దు. వాదించడం ద్వారా ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకోకండి. అవతలి వ్యక్తికి గౌరవం మరియు అంగీకారం యొక్క వైబ్రేషన్స్ పంపి వారి చెదిరిన మనసును నయం చేయండి. సామరస్యాన్ని పునరుద్ధరించి మీ మనసు నుండి సంఘటనను తొలగించండి. దాని వలన ఎలాంటి భావాలు గాయపడకుండా చూసుకోండి. అందరితో ప్రతిసారీ ఇలాగే ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd may 2024 soul sustenance telugu

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో

Read More »
22nd may 2024 soul sustenance telugu

భిన్నంగా ఉన్న వారి పట్ల దయకలిగి ఉండటం

మీరు ప్రపంచాన్ని ఇతరులకు భిన్నంగా ఎలా చూస్తున్నారో గుర్తించడం ద్వారా మాత్రమే మీకు భిన్నంగా ఉన్న వారి పట్ల దయ కలిగి ఉండాలనే అవగాహనను పెంపొందించుకోవచ్చు. భిన్నంగా ఉన్న వారు అంటే మీరు కలిసే

Read More »
21st may 2024 soul sustenance telugu

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి

Read More »