22nd jan soul sustenance - telugu

కనిపించని జీవనాధారము (భాగం-2 )

మనసు మన ఉనికికి ఆధారం. పంచతత్త్వాలుతో రూపొందించబడిన ప్రకృతి శాశ్వతమైనది, కానీ అది మంచి నుండి చెడుగా, సానుకూల నుండి ప్రతికూలంగా మారుతుంది. ప్రకృతిని సానుకూలంగా మార్చే శక్తి మనసుకు ఉంది మరియు అది ప్రతికూలంగా ఉంటే ప్రకృతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలోని ప్రతి కణం మనం సృష్టించే ప్రతి ఆలోచన ద్వారా ప్రభావితమవుతుంది. మన శరీరంలోని ప్రతి కణంతో మన మనసు నిరంతరం మాట్లాడుతుందని అంటారు. మనం ప్రతి క్షణం, మన ఆలోచనల ద్వారా, మన శరీరానికి మరియు ఈ బిలియన్ల కణాలతో రూపొందించబడిన అన్ని వ్యవస్థలకు సానుకూల లేదా ప్రతికూల సందేశాన్ని ఇస్తున్నాము. మన మనస్సు శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉంటే సందేశం సానుకూలంగా ఉంటుంది మరియు విరుద్ధంగా ఉంటే సందేశం ప్రతికూలంగా ఉంటుంది. మంచి ఆలోచనలను సృష్టించడం ద్వారా శరీరాన్ని నయం చేసే అపారమైన శక్తిని మనసు కలిగి ఉంది. ప్రతికూల మరియు విషపూరిత ఆలోచనలను సృష్టించడం ద్వారా అనారోగ్యాలను సృష్టించగలదు లేదా తీవ్రతను పెంచగలదు .

అలాగే, మనసు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి శాంతిని, ప్రేమను మరియు ఆనందాన్ని ఎంతగా ప్రసరింపజేస్తుందో, అంతగా భౌతిక సంపదను తీసుకురావడానికి మీ చుట్టూ ఉన్నవి సానుకూలంగా మారతాయి. ఉదా. సానుకూల మనసు సానుకూల పరిస్థితులను మరియు తగిన వ్యక్తులను ఆకర్షించి ఎక్కువ డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది. సరైన అవకాశాలు,సరైన వ్యక్తుల నుండి సరైన సమయంలో మీ వద్దకు రావడానికి దోహద పడుతుంది . కొన్నిసార్లు దీనిని అదృష్టం అని పిలుస్తారు, కానీ ఇది విశ్వానికి మనం ప్రసరించే శక్తి యొక్క ప్రత్యక్ష ఫలం మరియు ఈ శక్తి ఎంత సానుకూలంగా ఉంటే విశ్వం మీకు అనేక సానుకూల మార్గాల్లో తిరిగి ఇస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి, మాట్లాడండి మరియు వ్యవహరించండి. తద్వారా మీరు మీ జీవితంలో ఆర్థికంగా లాభపడే సానుకూల పరిస్థితులను సృష్టిస్తారు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »
30th-sept-2023-soul-sustenance-telugu

శుభాశీసులే ముఖ్యం

శుభోదయం! ఈ ఉదయం, మీరు మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లేదా గుడ్ లక్ లతో శుభాకాంక్షలు తెలిపారా? మీరు ప్రతిరోజూ ఇతరులను విష్ చేస్తారా? మీరు

Read More »