సెల్ఫ్ –కంట్రోల్ కళలో మాస్టర్

సెల్ఫ్ –కంట్రోల్ కళలో మాస్టర్

మనమందరం మంచిగా జీవించాలంటే మన జీవితాలు మన కంట్రోల్ లో ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాలపై బాధ్యత వహించడం మన శక్తి. తద్వారా మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమాటిక్ గా  కంట్రోల్ చేస్తాం. మనం మన నైతిక విలువలను జాగ్రత్తగా పాటించడం వలన సమాజం ఆదేశించిన విధానంలో మనం చిక్కుకోము. ఒకసారి మనం స్వయాన్ని చక్కగా హ్యాండిల్ చేసినట్లయితే, ఇతరులను సరైన మార్గంలో హ్యాండిల్ చేయగలం. మనం పొందాలనుకునే అన్ని విషయాలలో, సెల్ఫ్–కంట్రోల్ కు  మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇది మన ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను నియంత్రించే మన సామర్థ్యాన్ని సూచిస్తుంది. సెల్ఫ్–కంట్రోల్ సాధ్యమయ్యేలా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాలలో భిన్నంగా ప్రవర్తించడానికి మరియు ఒడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.

సెల్ఫ్ –కంట్రోల్ మరియు శ్రేయస్సును పొందడానికి ఈ విధానాలను అనుసరించండి:

  1. సెల్ఫ్–కంట్రోల్ జీవితంలోని సాధారణ పరిస్థితులలో అభ్యసించడం ద్వారా పెంపొందించుకోగల శక్తి.
  2. మెడిటేషన్ లో మీ ఆలోచనలను గమనించండి. ఇది మీ మనస్సును నియంత్రించడానికి, మనసుతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.
  3. అలవాటైన రియాక్షన్ కు బదులుగా ప్రతి సందర్భంలోనూ శక్తివంతమైన మరియు సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి. అవకాశాలను తెలుసుకొని ఎంపికలు చేయడం గురించి అవగాహన సెల్ఫ్ –కంట్రోల్ ను పెంచుతుంది.
  4. మీ విలువలు మరియు సూత్రాలకు కట్టుబడి ఉండండి. ప్రతి ఒక్కరితో మరియు ప్రతి పరిస్థితిలో నిర్భయంగా వాటిని ఉపయోగించండి. ఉదాహరణకు, తీవ్రమైన పర్యవసానంగా ఉన్నప్పటికీ మీ తప్పును అంగీకరించి  క్షమాపణ కోరండి. అలాగే, రోడ్డుపై మీరు ఒక్కరే ఉన్నప్పటికీ ట్రాఫిక్ నిబంధనలను పాటించండి.
  5. మీరు చదివే, చూసే, వినే మరియు మాట్లాడే ప్రతిదానిలో స్వచ్ఛతను ఎంచుకోండి. ప్రలోభాలకు లొంగకుండా సరైన ఆహారం పానీయాలను తీసుకోండి. ఇతరులు ఆమోదించక పోయినా మీకు సరైనది మరియు ఆరోగ్యకరమైనది చేయండి.

మీ జీవితాన్ని మీ కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఈ సంకల్పాలను  3 సార్లు రిపీట్ చేయండి. మీ మనస్సు మీ  సూచనలను ఎలా పాటిస్తుంది మరియు మీ శరీరం మీ లక్ష్యాలకు ఎలా సపోర్ట్ ఇస్తుందో చూడండి. సెల్ఫ్–కంట్రోల్ లో మాస్టర్ అవ్వండి:

నేను  శక్తివంతమైన ఆత్మను… నా ప్రతి ఆలోచనకు… మాటకు… ప్రవర్తనకు నేనే సృష్టికర్తను… నేను నా మనసును సరైన మార్గంలో ఉపయోగిస్తాను… పరిస్థితులు నాకు అనుకూలంగా ఉండక పోవచ్చు … నా మనసు ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉంటుంది … నేను … ఎక్కడ దృష్టి పెట్టాలో… ఏది చూడాలో. … ఏమి వినాలి … ఏమి మాట్లాడాలని … ఎంచుకుంటాను ..  నేను ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని చూస్తున్నాను … నేను ఇతరుల  అభిప్రాయానికి ప్రభావితం కానివాడిని  … నేను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతాను … నా మనస్సుకు … నా శరీరానికి నేనే యజమానిని.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »