Hin

సీన్‌లను జాగ్రత్తగా రికార్డ్ చేయండి

సీన్‌లను జాగ్రత్తగా రికార్డ్ చేయండి

మన ప్రతి ఆలోచన, మాట మరియు ప్రవర్తన ఆత్మపై ఒక ముద్ర వేస్తుంది. అవి సీడీలో రికార్డింగ్‌లా ఉంటాయి. కాబట్టి ఆత్మలైన మనం, మన వ్యక్తిత్వంలో భాగమైన ఈ శాశ్వత రికార్డింగ్‌ల సమూహం. ప్రతి రికార్డింగ్ స్వచ్ఛంగా మరియు పాజిటివ్ గా ఉండాలి, ఎందుకంటే ప్రతి రికార్డింగ్ ఈ జన్మలోనే కాకుండా భవిష్యత్తు జన్మలలో కూడా మన మనస్సు, శరీరం మరియు సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

రిలాక్స్ గా కూర్చుని, ప్రతి సన్నివేశంలో ఆత్మపై మంచి రికార్డింగ్‌లను మాత్రమే రికార్డు అయ్యే విధంగా శ్రద్ధ వహించమని మీ మనసుకు నేర్పండి. నెగెటివ్  సంఘటనలకు రెస్పొన్స్ గా నెగెటివ్ అనుభూతులను మరియు నెగెటివ్ రికార్డ్ ఆపడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాలను రిపీట్ చేయండి. అలా చేస్తే స్వచ్ఛత, శాంతి మరియు ప్రేమ వంటి గుణాలు మీ వ్యక్తిత్వంలో పాతుకుపోతాయి. మీరు ఆలోచించేది, మాట్లాడే మరియు చేసే కర్మలలో జాగ్రత్త వహిస్తే మీ ప్రతి కర్మ సరైనది అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా మంచి భాగ్యాన్ని తయారు చేస్తుంది.  

సంకల్పం –

నేను సంతోషకరమైన వ్యక్తిని. ఈరోజు…నేను అనేక పరిస్థితులను దాటుతున్నాను…నేను ఎన్నో అనుభవాలను అనుభూతి చెందుతున్నాను…వాటన్నింటిని నేను ఆత్మలో  శాశ్వతంగా రికార్డ్ చేస్తున్నాను. నేను… పరిస్థితులు మరియు వ్యక్తుల గురించి ఆలోచించేది, అనుభూతి చెందేది  మరియు కర్మలన్నీ .. అన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి… ఈ రికార్డింగ్‌లో రీ టేక్ లేదు… ఇది శాశ్వతమైనది… ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది ……అందువలన నేను జాగ్రత్త తీసుకుని …..నేను సరైన ఆలోచనలను మాత్రమే రికార్డ్ చేయడానికి ఎంచుకుంటాను. నేను రియాక్ట్ అయిన వ్యక్తుల యొక్క కొన్ని అలవాట్లు ……. ఎవరైనా దుర్భాషలాడితే, విమర్శిస్తే, దూకుడుగా, వంచించినా ..…. ఇప్పుడు నేను వారిని అర్థం చేసుకుంటాను… నేను వారి అలవాటును స్థిరత్వంతో ఎదుర్కొంటాను… వారు నన్ను అవమానించడం లేదని నేను రికార్డ్ చేస్తున్నాను… వారు వారి స్వభావానికి బాధితులు… నేను బాధ పడను… నేను కరుణ యొక్క రికార్డింగ్‌ ను  చేసుకుంటాను … నొప్పి లేదా తిరస్కరణ యొక్క రికార్డింగ్‌ కాదు. ఏదైనా బాధించే పరిస్థితి అయితే… నేను దానిని యథాతథంగా అంగీకరిస్తాను … నేను దానిని ప్రశ్నించను … నేను దానిని ప్రతిఘటించను. నేను ఏ సన్నివేశంలోనూ నెగిటివ్ రికార్డింగ్‌లను రికార్డ్ చేయను. నా స్వచ్ఛమైన మరియు పాజిటివ్  రికార్డింగ్‌లు నా మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి… శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి… సంబంధాలు బలంగా ఉంటాయి… అవి నాకు ఆశీర్వాదాలను అందిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »
8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »