Hin

22nd march soul sustenance telugu

విజయం కోసం ఆత్మ శక్తిని మరియు పాత్ర శక్తిని సమతుల్యం చేయుట (భాగము 3)

నిన్నటి సందేశాన్ని కొనసాగిద్దాము. ఆత్మ శక్తికి దోహదపడే మిగిలిన అంశాలు:

శుభ భావన, శుభ కామన, ఇతరులపై సంపూర్ణ ప్రేమ శక్తి – ఇతరులను కలుస్తున్నప్పుడు ఇటువంటి భావనలు మరియు కామనలు చక్కని భావాలను కలిగించి తిరిగి మీకు శుభ భావన మరియు శుభ కామనలను ఆశీర్వచనాల రూపంలో ఇతరుల నుండి అందిస్తాయి. ఇది కేవలం మిమ్మల్ని మాత్రమే సాధికపరచడం కాకుండా భౌతిక పాత్రను కూడా సూక్ష్మ స్థాయిలో దోహదపరుస్తుంది.  

సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో సంపూర్ణ పవిత్రత, స్వచ్ఛత శక్తి – ఈ స్థితిలో నేను కామము, క్రోధము, మోహము, లోభము, అహంకారము, అసూయ, ద్వేషము వంటి వికారాలకు లోనవ్వకుండా ప్రతి క్షణము నా పాత్రను సాధికారపరుచుకుంటూ ఉంటాను.

8 ముఖ్య శక్తులు – సహనము, సమాయించుకొనడము, సర్దుకొనుడము, పరిశీలన, నిర్ణయము, సంకీర్ణము మరియు సహయోగ శక్తులు – వీటి ఆచరణ ఆంతరికంగా మరియు బాహ్యంగా అనగా కేవలం మాటలు మరియు కర్మలలోనే కాకుండా ఆలోచనల స్థాయిలో కూడా ఆచరణ ఉండాలి. వీటిలో ఏ ఒక్క శక్తి లోపించినాగానీ, ఆలోచనలు మాటలు మరియు కర్మలలో తప్పకుండా నెగిటివ్ లేక అనవసరమైనవి ఉంటాయి, దీనివలన నేను ఆంతరికంగా బలహీనమై నా పాత్రతో సాధించే విజయం తగ్గుతుంది.

సత్యత శక్తి లేదా ఆధ్యాత్మిక జ్ఞానము – ఆత్మ, పరమాత్మ, సృష్టి నాటకము, కర్మ సిద్ధాంతముల గురించిన సత్య జ్ఞానము నాకు బోధపడిన స్థితి ఇది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానముతో అపారమైన శక్తిని పొందగలిగే స్థితి ఇది.

ఆత్మ శక్తిని దోహదపరిచే పై అంశాలపై,  నిన్నటి సందేశంలో వివరించబడిన వాటిపై కూడా శ్రద్ధ పెట్టి, జీవితంలో వాటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ, వివిధ పాత్రలను పోషిస్తున్న సమయంలో ఉపయోగిస్తూ ఉంటే ఏ పాత్రలోనైనా, జీవితంలోని ఏ క్షేత్రంలోనైనా కష్టం లేకుండా మనం ఆశించిన విజయాన్ని సాధింవచ్చు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »
11th jan 2025 soul sustenance telugu

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు

Read More »