HI

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదువుకుని ప్రతిరోజూ మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేసే ఆధ్యాత్మిక విద్యార్థులం. మెడిటేషన్ భగవంతునితో మనకున్న ఆధ్యాత్మిక లింక్ లేదా కలయిక. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో మన జీవితాలు అందంగా మరియు ఆనందంగా మారాయి. భగవంతుడు తన జ్ఞానం, స్వచ్ఛత మరియు శక్తులతో ప్రపంచాన్ని అందమైన స్వర్గంగా పరివర్తన చేసే కార్యంలో ఇప్పుడు ఈ రెండు ప్రాప్తులను  మనకు బహుమతిగా ఇస్తారు. మన ప్రస్తుత జీవితంలో ఈ రెండు ప్రాప్తులతో మనం సంస్కారాలలో స్వచ్ఛంగా మరియు పరిపూర్ణంగా తయారవుతాము మరియు మన చేతనము దివ్యంగా అవుతుంది. భగవంతుడు మనకు ఈ పరివర్తన మార్గాన్ని చూపిస్తారు . కానీ మనం ఈ మార్గాన్ని ఎలా కొనసాగించాలి ? ప్రారంభం ఎక్కడ? బ్రహ్మా కుమారీస్ వద్ద, మనము మా ఆధ్యాత్మిక ప్రయాణం 7 రోజుల ఆధ్యాత్మిక కోర్సుతో ప్రారంభిస్తాము, ఈ కోర్సు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మెడిటేషన్ టెక్నిక్ యొక్క విభిన్న అంశాలను మనకు వివరిస్తుంది.

మనము కోర్సును ప్రారంభించినప్పుడు, మనం వాస్తవానికి ఆధ్యాత్మిక శక్తి లేదా ఆత్మ  మరియు భౌతిక పదార్థంతో రూపొందించబడిన ఈ భౌతిక శరీరం కాదు అని తెలుసుకుంటాము. డ్రైవర్ కారును నడుపుతున్నట్లుగా, నేను ఆత్మ, ఈ శరీరాన్ని నడుపుతాను మరియు నియంత్రిస్తాను. నా శరీరం మరియు నా బ్రెయిన్(brain) వంటి శరీరంలోని వివిధ భాగాల ద్వారా మరియు నా కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చేతులు మరియు కాళ్ళ వంటి కర్మేంద్రియాల ద్వారా వివిధ చర్యలను నిర్వహిస్తాను. నేను, ఒక అభౌతికమైన చైతన్య శక్తిని. నేనే ఆలోచించే మరియు అనుభూతి చెందే మనసు; నిర్ణయించే మరియు జ్ఞానాన్ని ధారణ చేసే బుద్ధి;  సంస్కారాలు – ఈ మూడింటి యొక్క కలయికను. నా రూపం దివ్యమైన జ్యోతిర్బిందువు, భౌతిక నేత్రాలకు కనిపించదు మరియు నా వాస్తవిక గుణాలు శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం. ఈ జనన మరణ చక్రం లో  వివిధ శరీరాలలో వివిధ జన్మలు తీసుకుంటూ వాటిని కోల్పోయాను. మన అసలైన మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక నివాసం ఆత్మల  ప్రపంచం లేదా నిరాకార ప్రపంచం లేదా నిశ్శబ్ద ప్రపంచం అని కూడా మనం తెలుసుకుంటాము, దీనిని పరంధామం  లేదా నిర్వాణధామం లేదా శాంతిధామం అని కూడా అంటారు, ఇక్కడ నుండి భూమిపై భౌతిక ప్రపంచంలో మన పాత్రలను పోషించడానికి వస్తాము. అలాగే, భూమిపై జరిగే ప్రపంచ నాటకంలో నాలుగు వేర్వేరు యుగాలలో మన విభిన్న పాత్రలు లేదా జన్మలను అర్థం చేసుకున్నాము.  ఈ ప్రపంచ నాటకంలో ఏ మానవ ఆత్మ అయినా గరిష్టంగా 84 జన్మలు తీసుకుంటుంది. చివరగా, మనం మానవులుగా మాత్రమే పుడతాము  తప్ప వివిధ రకాల జంతువులు, పక్షులు లేదా కీటకాలలో కాదు అని కూడా భగవంతుని నుండి నేర్చుకుంటాము. ఎందుకంటే మనం మానవ శరీరాలలో మాత్రమే మన పాత్రలను పోషించే సంస్కారాలను కలిగి ఉంటాము. అలాగే, మనం మన పూర్వ జన్మలలో దేవీ దేవతలుగా ఎలా ఉండేవారమని, సాధారణంగా విశ్వసిస్తున్నట్లుగా, మనము  కోతులు కాదు అని కూడా తెలుసుకున్నాము. మనము జనన-మరణ చక్రంలోకి  వచ్చి  మన ఆత్మిక స్థితి, ఆధ్యాత్మిక స్వచ్ఛత మరియు దైవీ లక్షణాలను కోల్పోయినప్పుడు అదే దేవీ దేవతలను ఆరాధించడం ప్రారంభించాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2024 soul sustenance telugu

మీరు భగవంతుడిని నమ్ముతారా? మీరు వారి ఉనికిని అనుభవం చేసుకుంటున్నారా?

భగవంతుడు మన ఆధ్యాత్మిక తల్లి-తండ్రి మరియు విశ్వంలో అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి. అనేక శతాబ్దాలుగా, భగవంతుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిచే ప్రేమించబడ్డారు, గౌరవించబడ్డారు. అయినప్పటికీ, భగవంతుడు మానవ రచన మరియు వారి ఊహ అని

Read More »
24th april 2024 soul sustenance telugu

తోటివారి ఒత్తిడితో వ్యవహరించడం

సమాజంలో అంగీకారం, గౌరవం పొందడానికి మనం చేసే ప్రయత్నాలలో, సమాజానికి తగ్గట్టుగా ఉండటా నికి ప్రాధాన్యత ఇస్తాము. ఇతరులు చేసేది మనమూ చేయవలసిన అవసరం ఉందని భావిస్తాము. తోటివారి పెట్టే ఒత్తిడి మనం సిద్ధంగా

Read More »
23rd april 2024 soul sustenance telugu

బాహ్య గందరగోళం మరియు ఆంతరిక భావోద్వేగాల నుండి ఉపసం‌హరించుకోవడం

సంకీర్ణ శక్తిని తాబేలు ప్రవర్తనతో పోల్చవచ్చు. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు, తాబేలు దాని పెంకులోకి (గట్టి బాహ్య రక్షణ పొరలోకి) వెళ్లిపోతుంది. రోజంతటిలో కొన్ని సార్లు లోలోపలికి అడుగు పెట్టి మనల్ని మనం చూసుకోవటమే

Read More »