23rd april soul sustenance telugu

ఆందోళన లేని చేతనాన్ని ఉంచుకోవడం

మీ మనస్సు ఇలా అయితే ఎలా, ఎప్పుడు-అవుతుంది, మొదలైన చింతలతో నిరంతరం నిండి ఉంటుందా? ఎల్లప్పుడూ ఏదో ఒక గట్టి ముప్పు ఉన్నట్లుగా మీరు మీ జీవితాన్ని మరియు ప్రపంచాన్ని నెగిటివ్ మార్గాల్లో చూస్తున్నారా? నిరంతర ఆందోళన సవాళ్లను ఎదుర్కునే సామర్థ్యాన్ని స్తంభింపజేస్తుంది. ఇది మనల్ని హరించడం మాత్రమే కాకుండా మన జీవితంలో మరింత నెగిటివిటీని ఆకర్షిస్తుంది. మీరు చింతించే అలవాటులో చిక్కుకున్నారా? మీరు మీ జీవితం గురించి లేదా మీ ప్రియమైన వారి జీవితం గురించి నెగిటివ్ స్క్రిప్ట్‌లను వ్రాస్తున్నారా, నిరంతరం భయపడుతున్నారా? ఆందోళన అనేది మన మనస్సు యొక్క నెగిటివ్ ఆలోచనల పరిణామం. మన చింతలు చాలా వరకు గతం గురించినవి, అదుపు చేయలేనివి లేదా ఎప్పటికీ కార్యరూపం దాల్చనివి కానీ ఆందోళన యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ మనల్ని క్షీణింపజేసి మన పరిస్థితులకు ప్రసరించి, వాటిని కఠినతరం చేస్తాయి. మనం ఎక్కువగా ప్రేమ పేరుతో మనుషుల కోసం చింతిస్తాం. చింతించటానికి బదులుగా శ్రద్ధ వహిద్దాం. సంరక్షణ పాజిటివ్ వైబ్రేషన్స్ ని ప్రసరింపజేస్తుంది. శ్రద్ధ వహించడం ద్వారా మనం అత్యధిక ఫ్రీక్వెన్సీ ఆలోచనలను చేస్తాము మరియు ఆ ఆలోచనలు జీవితంలో పాజిటివిటీ ని ఆకర్షిస్తాయి. మనల్ని మనం మరియు మన జీవితం అందంగా ఉంటుందని విశ్వసిద్దాం. మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మార్చగలిగినదాన్ని మార్చగల  మరియు మనం చేయలేని వాటిని అంగీకరించే శక్తి మనకు ఉంది.

మీరు శక్తివంతమైన వారు అని ప్రతిరోజూ మీకు మీరు గుర్తు చేసుకోండి. మీ ఆంతరిక శక్తిని పెంచుకోండి. ఈ రోజు ప్రతి సన్నివేశంలో మీ శక్తిని ఉపయోగించండి. మీరు నిర్భయులు. శాంతిగా ఉంటూ దానిని విశ్వంలోకి ప్రసరింపజేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా స్పందించండి. మీ జీవితం అందంగా ఉంది, ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంది, సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉన్నాయి, కెరీర్ విజయవంతంగా ఉంది. దేని గురించి చింతించకండి. మీ మనస్సును జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి గంటకు విరామం తీసుకొని ఒక నిమిషం పాటు మీ ఆలోచనలను చెక్ చేసుకోండి మరియు కొద్దిగా స్వల్పమైన ఆందోళన ఉంటే వాటిని మార్చండి. ప్రతిరోజూ మెడిటేషన్ మరియు ఆధ్యాత్మిక అధ్యయనంతో మీ మనస్సును పెంపొందించుకోండి. ప్రతిరోజూ మీ ఆంతరిక శక్తిని పెంచుకోండి. ఎలాంటి ఒత్తిడినైనా స్థిరత్వంతో ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోండి. మీ కర్మలపై దృష్టి పెట్టండి. వాటిని సరిగ్గా ఉంచండి, తద్వారా మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సరైన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన యొక్క పరిణామాలు మీకు సురక్షితమైన భవిష్యత్తును తయారు చేస్తాయి. దేనికీ చింతించకండి. సవాలు ఉన్నప్పటికీ, చింతించకండి. మీరు సమస్యను పరిష్కరించేవారు. మీ ఆంతరిక నిశ్చలత సమస్యకు శక్తిని ప్రసరింపజేసి పరిస్థితిని గందరగోళం నుండి ప్రశాంతతకు మారుస్తుంది. మీ జీవితంలో ప్రతిదీ పరిపూర్ణమైనది మరియు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »