Hin

మిమ్మల్ని మీరు ప్రేమించండి

మిమ్మల్ని మీరు ప్రేమించండి

క్షణకాలం ఆగి, మన వైఖరిని మనం గమనించుకుంటే, మనల్ని మనం ప్రేమించుకోవడం కన్నా ఇతరులను ప్రేమించడమే సులభం అని తెలుస్తుంది. ఈ స్వీయ-ప్రేమ లేకపోవడం అనేక రూపాల్లో కనిపిస్తుంది, ఉదాహరణకు – మన శరీరాన్ని, మనసును గౌరవించకపోవడము, తప్పులకు, వైఫల్యాలకు మనల్ని మనం నిందించుకుంటూ ఉండటము, మనలోని సామర్థ్యాలను మనం తక్కువ అంచనా వేస్తూ ఉండటము. మనల్ని మనం ఎంత ప్రేమిస్తున్నాము అన్నదానిబట్టే మనమెంత బాగా జీవిస్తున్నాము అనేది నిర్థారితమవుతుంది.

  1.     మీకు లోటు కలిగినప్పుడు మిమ్మల్ని మీరు కఠినంగా జడ్జ్ చేసుకుంటున్నారా? మీరు మంచిగా చేస్తున్నప్పుడు నిజంగా మీ మనసును, హృదయాన్ని విశాలంగా తెరచి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? లేక మీరు విలువ ఇచ్చేవారు మీకు ప్రేమను పంచాలి అని వేచి ఉన్నారా? స్వీయ ప్రేమ ఒక కళ, ఇందులో మనం ప్రావీణ్యం పొందాలి.
  2.   మనమేమిటో, మన ఆంతరిక గుణము, మన వ్యక్తిత్వము మరియు మన స్వభావం ఏమిటో అర్థం చేసుకోవడమే ప్రేమ. ఇది ఒక శక్తి, దీనిని మనం సృష్టించి ఇతరులకు కూడా ఇవ్వవచ్చు. కానీ మనలో కోపం, అపరాధ భావం, భయం, నొప్పి వంటి అప్రియమైన భావాలు తలెత్తినప్పుడు మనలోని ప్రేమకు మనం అడ్డుకట్ట వేస్తున్నాము. మనం ఇతరుల నుండి ప్రేమను కోరుకుంటాం. కానీ మనల్ని మనం తప్ప అందరూ ప్రేమించినా, మనం ఆ ప్రేమను అనుభవించలేము.
  3.   మనం ప్రేమమూర్తులం అని గుర్తుంచుకున్నప్పుడు ఇతరులు మనకు ప్రేమను అందించాలన్న భావనపై ఆధారపడము. అంగీకరించడం, ప్రశంసించడం, ప్రేరేపించడం, మనతో మనం బేషరతుగా సఖ్యతతో ఉండటం వంటి గుణాలతో స్వీయ ప్రేమను పెంచుకోవచ్చు. మనం స్వాభావికంగానే అందమైనవారిమి, స్వయం కోసం ఇప్పటినుండి మరింత ధ్యాస పెడదాం.
  4.   నాకు ప్రేమ కావాలి అని ఎప్పుడూ అనకండి. మీ మనసులో వచ్చే వ్యాకరణంలోనే మార్పు తీసుకురండి, అప్పుడు స్వీయ ప్రేమ ఆటోమేటిక్‌గా ప్రవహించడాన్ని మీరు గమనిస్తారు. గుర్తు చేసుకోండి – ఎటువంటి షరతులు, హద్దులు లేకుండా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నాతో నేను చెప్పుకునే ప్రతి పదము నాలో బలాన్ని నింపుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »
13th feb 2025 soul sustenance telugu

స్వీయ నియంత్రణ కళలో ప్రావీణ్యం పొందటం

మనమందరం బాగా జీవించడానికి మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటాము. మన మనస్సు, బుద్ధి మరియు స్వభావాన్ని నియంత్రించడం మన శక్తి. అది మన భౌతిక ఇంద్రియాలను కూడా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది.

Read More »