23rd feb soul sustenance - telugu

ప్రేమ నన్ను బాధించగలదా?

మనం జీవితంలో అనేక కొత్త సంబంధాలను ఏర్పరుచుకున్నప్పుడు, కొంతమంది వ్యక్తులతో మన లోతైన ఆలోచనలు మరియు భావాలను పంచుకోవడం ద్వారా మన ఆంతరిక ఎమోషన్స్ ప్రపంచానికి ఆహ్వానిస్తాము. వారు కూడా వారి ఆంతరిక ప్రపంచాన్ని మనతో పంచుకున్నప్పుడు, ఆ సంబంధం విలువైనదిగా భావిస్తాము. అర్ధవంతమైన కనెక్షన్ తయారు అవుతుంది. కానీ కాలం గడిచేకొద్దీ ప్రేమ మొహంగా మారుతుంది. అటాచ్‌మెంట్ అనేది అశాంతి కలిగించే ఎమోషన్ – ఇది గొప్ప ఆనందానికి మూలం కావచ్చు అదే విధంగా లోతైన గాయాలను కూడా సృష్టించగలదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇద్దరికీ ఆనందాన్ని కలిగించడానికి అవతలి వ్యక్తిని కలుపుకోవడం. ప్రేమ ఉన్నప్పుడు మనం ఇతరులను బాగా చూసుకుంటాము, ఇతరులను వారికి అనుగుణంగా ఉండనిస్తాం, వారిని కోల్పోతామని భయపడము. కానీ మొహం ఉన్నప్పుడు, ఆ సంబంధం ప్రత్యేకమైపోతుంది మరియు కేవలం మన కొరకు మాత్రమే ఆలోచిస్తాము. వారు కలత చెందినప్పుడల్లా, మనము బాధపడతాము. వారి ప్రవర్తన మారినప్పుడు, మనం గాయపడతాము. మనం వారిని కోల్పోతామని భయపడినప్పుడు మనం గాయపడతాము. నేను వారిని ప్రేమిస్తున్నాను కాని వారు నన్ను బాధపెట్టారు అని అనుకుంటాము. ప్రేమ బాధించదు మరియు వ్యక్తులు బాధించలేరు. వారి పట్ల ప్రేమ పేరుతో మనకున్న మొహం మనకు బాధను కలిగిస్తుంది.
తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, బిడ్డ, తోబుట్టువులు లేదా స్నేహితుడి ఎవరిపట్ల ప్రేమ అయినా అది మనం హృదయాలలో చోటు తీసుకున్నట్టే . అలాంటి ప్రేమ, శ్రద్ధ మరియు సాన్నిహిత్యం, మొహం గా మారితే మనల్ని మనం బాధించుకుంటాము. మనం సంబంధాలను లేబుల్‌లతో గుర్తించడం మానేసి, ప్రతి ఒక్కరినీ పవిత్రమైన ఆత్మలుగా చూసినప్పుడు, మోహం లేని ప్రేమను అనుభవిస్తాము. మన దగ్గర సంబంధీకులను ప్రేమిస్తున్నామా లేదా మోహంలో ఉన్నామా అని లోతుగా పరిశీలించుకుందాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »