23rd jan soul sustenance - telugu

కనిపించని జీవనాధారము (భాగం-3 )

మన సంబంధాలపై మన మానసిక స్థితియే అత్యంత ముఖ్యంగా మరియు ప్రాథమికంగా ప్రభావం చూపుతుంది. సంబంధాలలో ప్రేమ , ఆనందంతో నింపుతుంది. మనము తరచుగా వ్యక్తులతో చాలా సానుకూలంగా మాట్లాడుతాము, చాలా మంచిగా ప్రవర్తిస్తాము, కానీ మన మనసు అసూయ, పగ, ద్వేషం, అనుమానం మరియు అభద్రత వంటి భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇది మన సంబంధాలను విపరీతంగా దెబ్బతీసి వాటిని అంతర్గతంగా బలహీనపరుస్తుంది. కొన్నిసార్లు ఈ దాగిన భావోద్వేగాల ప్రభావాలు వెంటనే కనిపించవు కానీ అవి మనకు తెలియకుండానే అంతర్గతంగా సంబంధాలకు హాని కలిగిస్తాయి. కాబట్టి, ఎల్లప్పుడూ తేలికగా ఉండి, మధురత అనే శక్తిని ప్రేమ రూపంగా, సంతృప్తిని ఆనంద రూపంగా, ప్రశాంతతను శాంతి రూపంగా ప్రసరింపజేసే మనసు తన సంబంధాలన్నింటిలోనూ అదే శక్తిని తిరిగి పొందుతుంది. ఇది విభిన్న వ్యక్తిత్వాలు మరియు విభిన్న దృష్టి కోణాలు ఉన్న వివిధ సంబంధాలను సమస్యలు లేని విజయవంతమైన సంబంధాలుగా మార్చేస్తుంది. చివరగా, మనమందరం మన జీవితంలో విభిన్న పాత్రలను పోషిస్తాము. ఒక వ్యక్తి జీవితంలో తండ్రి, కొడుకు, భర్త, సోదరుడు, ఇంజనీర్ మొదలైన విభిన్న పాత్రలను పోషిస్తాడు. ఈ పాత్రలన్నింటికీ విభిన్న గుణాలు, శక్తులు నైపుణ్యాలు మరియు నమ్మకాలు అవసరం. మనసు ఎంత ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే అలాగే శాంతి, ప్రేమ , ఆనందం అనే ప్రాథమిక గుణాల స్వరూపంగా ఉంటే, అది అంత అటెన్షన్ గా మరియు పాజిటివ్ గా ఉంటుంది. ఫలితంగా, ఇది తన ప్రతి పాత్రకు సరైన గుణాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని అమలు చేస్తుంది. అలాగే, ఈ మూడు సద్గుణాలతో కూడిన సానుకూల ఆలోచనలతో నిండినప్పుడు మనసు తన శక్తిని చాలా ఆదా చేస్తుంది మరియు ప్రతి పరిస్థితిలోనూ శక్తివంతంగా ఉంటుంది. మనసు ఎంత శక్తివంతంగా ఉంటే, అది సరైన నిర్ణయాలు తీసుకోగలదు. మంచి, చెడుల మధ్య సులభంగా వివక్ష చూపగలదు, ఇదే విజయానికి ప్రాథమిక మెట్టు . మన చుట్టూ ఉన్న వారందరూ మంచి మనసు యొక్క ప్రభావంతో ఎంతో ప్రయోజనం పొందుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »