పరమ గురువు అయిన పరమాత్మ నుండి దీవెనలు తీసుకోవడానికి 5 మార్గాలు

పరమ గురువు అయిన పరమాత్మ నుండి దీవెనలు తీసుకోవడానికి 5 మార్గాలు

  1. పరమాత్మునితో సైలెంట్ అపాయింట్‌మెంట్‌తో మీ రోజును ప్రారంభించండి – ప్రతిరోజూ తెల్లవారుజామున, మిమ్మల్ని మీరు ఒక ఆత్మగా భావించి పవిత్రమైన నిశ్శబ్ద ప్రపంచమైన ఆత్మల ప్రపంచానికి ఎగిరిపోండి. పరమాత్ముని ఆధ్యాత్మిక వెలుగు మరియు శక్తిలో మునిగిపోండి. ప్రతిరోజూ ఈ అనుభవంలో కనీసం 20 నిమిషాలు గడపండి. పరమాత్ముని మనోహరమైన ఆశీర్వాదాలను అన్‌లాక్ చేయడానికి మరియు స్వీకరించడానికి ఇది ఆధారం.
  2. మిమ్మల్ని మీరు దివ్యంగా, పాజిటివ్ గా మరియు శక్తివంతంగా మార్చుకోండి – మంచితనం మరియు దైవత్వంతో నిండి ఉండి, సరైన ఆలోచనలతో అన్ని పరిస్థితులలో బలంగా ఉండేవారే సంపూర్ణమైన వ్యక్తి. మీరు ఈ మూడు విధాలుగా పరిపూర్ణంగా ఉన్నపుడు పరమాత్ముడు  తన ప్రేమ, ఆనందం మరియు గౌరవం యొక్క ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతారు. తద్వారా మీరు జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని పొందుతారు.
  3. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీ వ్యక్తిగత నిధిగా చేసుకోండి – మీరు ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా వింటారో, అంత ఎక్కువగా మీరు పరమాత్మునితో లోతైన మరియు కనపడని బంధాన్ని ఏర్పరచుకుంటారు. జ్ఞానం అనేది భగవంతుని నిధి, అ నిధిని మన జీవితంలో అడుగడుగునా నింపుతారు. మనం జ్ఞానాన్ని పొందుతూ, మనన చింతన చేస్తూ, ఇతరులతో పంచుకోవడం మరియు ప్రతి చర్యలో దానిని ఉపయోగించడమే పరమాత్మ నుండి ఆశీర్వాదాలను పొందదానికి ఆధారం.  
  4. మీ జీవితంలో అందరికంటే ఎక్కువగా పరమాత్మను ప్రేమించండి – మొత్తం విశ్వంలో పరమాత్మడు అత్యంత సుందరమైన మరియు దివ్యత్వం కలిగినవారు. మీరు వారిని ఎంతగా ప్రేమిస్తారో, వారి సన్నిహిత్యాన్ని ఎంత పొందుతారో, మీరు అంత సంతోషంగా, తేలికగా మరియు ఆశీర్వాదాలతో నింపడతారు. వారి ఆనందస్వరూపం మరియు ఆశీర్వాదాలు వారి స్వచ్ఛమైన కాంతిలో నవ్వే, మాట్లాడే, చూసే, నడిచే మరియు ప్రతి పనిని చేసే కొత్త మనిషిగా మార్చేస్తాయి.
  5. ప్రతి సంబంధంలో పరమాత్ముని ఇంద్రజాలంతో నింపండి  – ఈ ప్రపంచంలో మనం కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరూ పరమాత్ముని విశేషమైన పిల్లలు  మరియు ఏంజెల్ కూడా. మన సంబంధాలన్నింటినీ  సంతృప్తితో, పరమాత్ముని గుణాలు మరియు మంచితనంతో నింపడం పరమాత్మునికి  మన పట్ల ఉన్న గాఢమైన ప్రేమకు మనము రిటర్న్ ఇవ్వటము. అలా ఎంత ఎక్కువగా చేస్తే, అంత ఎక్కువగా భగవంతుడు సంతోషపడతారు   మరియు నిరంతరం మనల్ని ఆశీర్వదిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »