బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

భగవంతుని ఆధ్యాత్మిక రూపం మనలాంటి దివ్యమైన పరమ జ్యోతి బిందువు, భౌతిక నేత్రాలకు కనిపించదు అని తెలుసుకున్న తర్వాత, మనం భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలో మరియు ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా బ్రహ్మా కుమారీల యొక్క 7 రోజుల కోర్సు మనకు మార్గనిర్దేశం చేస్తుంది. వారు  పరమ ఆత్మ, ఆధ్యాత్మిక తండ్రి అలాగే మానవ ఆత్మలందరికీ పరమ తండ్రి. అబ్రహం, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్, మహావీరుడు, శంకరాచార్య, గురునానక్ వంటి ప్రముఖ మత స్థాపకులు; సాధువులు మరియు దేవతలు అయిన శ్రీ రాధ కృష్ణ, శ్రీ లక్ష్మీ నారాయణ, శ్రీ సీత రాములు  వంటి దైవీ ఆత్మలందరికీ కూడా వారు తండ్రి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మరియు వివిధ మతాలలో వారిని  హెవెన్లీ గాడ్ ఫాదర్(Heavenly Godfather), భగవాన్, ఈశ్వర్, శివుడు, అల్లా, ఖుదా మరియు యెహోవా వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. వారు ఏ మానవ శరీరంలోనూ జన్మించని ఏకైక ఆత్మ మరియు ఆవినాశి ఆశరీరి , ఆత్మాభిమాని మరియు పవిత్రమైన వారు. ప్రపంచంలోని ఆత్మలందరు, దివ్య ఆత్మలు మరియు దేవతలు కూడా భౌతిక రూపాన్ని కలిగి ఉంటారు మరియు మానవ శరీరంలో జన్మిస్తారు.

భగవంతుడు శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు జ్ఞానం అనే 7 గుణాల సాగరుడని కూడా ఈ కోర్సులో తెలుసుకుంటాం. వారు  ఈ గుణాలలో శాశ్వతంగా స్థిరంగా ఉంటారు.  వివిధ భౌతిక జన్మలు తీసుకోని కారణంగా వాటిని ఎప్పటికీ కోల్పోరు. అలాగే, భగవంతుని వాస్తవిక ఇల్లు  ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకుంటాము. వారి  ఇంటిలో వారిని  ఎలా విజువలైజ్ చేయాలో, ఎలా గుర్తు చేసుకోవాలో నేర్చుకుంటాము.  ఇది ఆత్మల  ప్రపంచం లేదా నిరాకార ప్రపంచం, భగవంతుని ఆధ్యాత్మిక పిల్లలు అయిన మానవ ఆత్మల ఆధ్యాత్మిక గృహమే. చివరిగా మరియు చాలా ముఖ్యమైనది, ప్రపంచ నాటకంలో భగవంతుని అత్యంత ముఖ్యమైన కార్యం ఏమిటి, వారు ఇనుప యుగం లేదా కలియుగాన్ని స్వర్ణయుగం లేదా సత్యయుగంగా, అలాగే, కామ, క్రోధ, దురాశ, మోహం, అహంకారం, ఈర్ష్య, ద్వేషం వంటి దుర్గుణాలతో నిండిన మానవులను, దైవీ గుణాలు, విశేషతలు  మరియు వారి జీవితాలు పవిత్రత, శాంతి, ప్రేమ మరియు ఆనందం ఉన్న  దేవీ దేవతలుగా ఎలా     మారుస్తారో మనం తెలుసుకుంటాము. 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th-sept-2023-soul-sustenance-telugu

శుభాశీసులే ముఖ్యం

శుభోదయం! ఈ ఉదయం, మీరు మీ కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులకు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ లేదా గుడ్ లక్ లతో శుభాకాంక్షలు తెలిపారా? మీరు ప్రతిరోజూ ఇతరులను విష్ చేస్తారా? మీరు

Read More »
29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »