అహంకారాన్ని వదిలేయండి

అహంకారాన్ని వదిలేయండి

మనమందరం అహాన్ని వదిలేయాలని కోరుకుంటాము, అయితే అహం అంటే ఏమిటి? మనం తప్పుగా, సంపాదించిన దానిని మన గుర్తింపుగా చేసుకోవటమే అహం. అది మన అర్హత, స్థానం, నైపుణ్యం, సంబంధం లేదా ఆస్తులు కావచ్చు. వాటిని అంటిపెట్టుకుని నేను ఇది లేదా నేను అది అనే భావంతో జీవిస్తాం. ఇతరులు కూడా మనల్ని అదే విధంగా గుర్తించాలని ఆశిస్తాము. ఆమె నా అహాన్ని దెబ్బతీసింది అని మనం అన్నప్పుడు, వాస్తవానికి ఆమె నా గురించి నాకున్న గుర్తింపుకు హాని చేసిందని అర్థం.

అహంకారాన్ని వదిలేయడానికి “నేను వాస్తవంగా ఎవరిని?”  అనే భావంతో ఆలోచించండి. ఏదైనా కలిగి ఉండటం లేదా ఏమీ లేకుండా ఉండటం అనే అహంకారాన్ని ముగించడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాన్ని రిపీట్ చేయండి. మీరు అహం నుండి వినయం వైపు మారినప్పుడు మీరు ప్రేమ మరియు గౌరవాన్ని కోరుకోవడం మానేస్తారు. మీరు ఇతరులకు మీ ప్రేమ మరియు అంగీకారాన్ని ప్రసరింపజేసే విధానానికి మారతారు.

సంకల్పం :

నేను స్వచ్ఛమైన ఆత్మను. నేనెవరో నాకు స్పష్టంగా తెలుసు… నా గుర్తింపును తెలుసుకొనే ఉంటాను… నేను ఆత్మను… నేను చాలా పాత్రలను పోషిస్తాను… ఈ జీవితకాలంలో నేను చాలా సంపాదించాను… కానీ నేను సంపాదించినవి నేను కాదు… అవి నావి….అవి నేను కాదు…  నేను ఆత్మను… స్వచ్ఛమైన, శక్తివంతమైన, ప్రేమగల, సంతోషకరమైన జీవిని ….అన్నింటినీ సంపాదించిన ఆ శక్తిని …నేను  నా పేరును కాదు … నా శరీరాన్ని కాదు  … నా సంబంధాలు కాదు  … నా డిగ్రీలు  కాదు  … నా హోదాను కాదు …. నేను… స్వచ్ఛమైన ఆత్మ అనే స్మృతిలో ఉంటాను… మరియు నేను కలిసే, సంభాషించే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన ఆత్మయే. నేను ఏమీ కోల్పోతానని భయపడను. నా దగ్గర ఉన్నవాటికి నేను ట్రస్టీని…నేను వాటిని చూసుకుంటాను… కానీ అవి నేను కాదు. నేను నిరాడంబరంగా ఉంటాను… నేను తేలికగా మరియు స్వచ్ఛంగా ఉంటాను… నేను…పదవి లేదా ఆస్తుల.. అహం లేకుండా జీవిస్తాను. నాకంటే ఎవ్వరూ తక్కువ కాదు…ఎవరూ నాకంటే గొప్పవారు కాదు…అందరూ సమానమే…ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన, శక్తిమంతమైన ఆత్మ… మనుషులు నాకు  కావాల్సిన విధంగా ఉండాల్సిన అవసరం లేదు… వారు వారి విధంగా ఉండ వచ్చు… నేను నాలా ఉంటాను…సరైన విధంగా ఉంటాను …  నేను .. నమ్రత మరియు శక్తితో ప్రతిస్పందిస్తాను … నేనెవరో నాకు తెలుసు… నేను ఇతరులతో పోల్చుకోను…నేను పోటీపడను…నేను నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను … నా భావాలు నావి…ఇతరులపై ఆధారపడవు…నాకు ఏమీ అవసరం లేదు … నేను కేవలం  … ప్రేమ మరియు ఆనందాన్ని ఇస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »