అందరు ఆశించినట్లుగా ఉండటం

అందరు ఆశించినట్లుగా ఉండటం

అందరి ఆపేక్షలు కొన్నిసార్లు మనకి భారంగా అనిపిస్తాయి. మన జీవితంలో మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, భార్య లేక భర్త, ఆఫీసు సహోద్యోగులు, పిల్లలు మరియు చాలా మంది ఇతర వ్యక్తుల ఆపేక్షలు మనపై ఉంటాయి. వారు మన ఎంపికలు మరియు నిర్ణయాలను నియంత్రించినట్లుగా అనిపిస్తుంది. అందరు, ఇతర వ్యక్తుల ఆపేక్షలకు అనుగుణంగా జీవించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు, కానీ చాలామంది పూర్తిగా విజయవంతం కాలేరు. ప్రతి ఒక్కరూ మనతో ఎల్లవేళలా సంతోషంగా ఉండలేరు, కాబట్టి వారి అవసరాలను సరిపోల్చడానికి ప్రయత్నించడం వల్ల మనం అలసిపోతాము.

  1. అందరి ఆపేక్షలు మనలో ఒత్తిడిని కలిగిస్తాయి మరియు వారిని సంతోషపెట్టలేననే భయం వైపు నడిపిస్తాయి. ఇది మన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మీ సామర్థ్యం, మీ ప్రాధాన్యత మరియు మీ సూత్రాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి, ప్లాన్ చేసి, అమలుపరిచి  మీ విజయాన్ని సాధించండి మరియు  ఆనందించండి. 
  2. ప్రతి సంబంధంలో నిస్వార్థమైన శ్రద్ధ చూపిస్తూ మీరు చేసేది ఉత్తమంగా చేయండి. ఆ తర్వాత, మీరు ఇతరుల ఆపేక్షలకు అనుగుణంగా ఉన్నారా, మీకు ఆమోదం లభిస్తుందా లేదా, మీరు తగినంత మంచివారిగా కనిపిస్తారా అనే చింతను పెట్టుకోకండి. మీ కోసం స్పష్టమైన సరిహద్దులను సెట్ చేసుకొని ఇతరులకు తెలియజేయండి.
  3. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మరియు ఇతరులకు ప్రేమను ప్రసరింపజేయండి. కానీ మీరు మీ సామర్థ్యంలో లేనిది కూడా ఇతరుల ఆపేక్షలను  తీర్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు సంతోషంగా ఉండలేరు. మీ అసంతృప్తి, మీరు ఎవరి ఆపేక్షలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారో వారికి కూడా బాధ మరియు అసౌకర్యాన్ని ప్రసరింపజేస్తుంది మరియు మీ సంబంధాల శక్తిని దెబ్బతీస్తుంది.
  4. మీరు చేయలేని పనిని చేయడానికి అంగీకరించకండి. మర్యాదగా మరియు దృఢంగా తిరస్కరించండి. దాని గురించి అపరాధ భావంతో ఉండకండి. సత్యంగా ఉంటే ఇతరులు   మిమ్మల్ని మీరు ఎవరో, ఎలాగున్నారో  అలాగే  అంగీకరిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »