Hin

తొందరపాటు లేకుండా ఉండటానికి 5 చిట్కాలు

తొందరపాటు లేకుండా ఉండటానికి 5 చిట్కాలు

  1. క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు విరామాన్ని అభ్యసించండి – సాధారణంగా నెగిటివ్ పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే మనం అతిగా ఆలోచించేస్తాము, అది మనలో ఆత్రుతను తీసుకువస్తుంది. చేస్తున్న పనికి కొద్దిసేపు విరామాన్నిచ్చి శాంతి, పాజిటివిటీ మరియు శక్తితో కూడిన ఆలోచనలు ఆ సమయంలో చేసినప్పుడు ఆలోచనలు నెమ్మదిస్తాయి, చేయాల్సిన పని మీద శ్రద్ధ పెట్టగలుగుతాము మరియు తొందరపాటుతనం ఉండదు.
  2. మీ రోజును మెడిటేషన్ మరియు సైలెన్సుతో ప్రారంభించండి – రోజంతా మీ ఆలోచనలు హడావుడి లేకుండా నిదానంగా ఉండాలంటే మీ రోజును భగవంతుడితో జోడించే మెడిటేషన్‌తో ప్రారంభించండి. భగవంతుడు శాంతి మరియు సైలెన్సు సాగరుడు. ఉదయం సమయంలో మనసు ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ సమయంలో మనసును మెడిటేషన్‌తో ప్రశాంతంగా ఉంచగలిగితే పూర్తి రోజును ప్రశాంతంగా గడపవచ్చు, హడావుడి తక్కువ, పని ఎక్కువ జరుగుతుంది.
  3. బాగా ఆలోచించి మీ మనసులో మీ సమయాన్ని పునఃవ్యవస్థీకరించుకోండి – అకస్మాత్తుగా మన ఎదురుగా ఏదైనా కష్టం వచ్చి అది మన నుండి మన వద్ద ఉన్నదానికన్నా ఎక్కువ ఆశిస్తే మనలో ఆత్రం పెరుగుతుంది. అప్పుడు, సమయం కొద్దిగా ఉంది కాబట్టి తొందరపడుతుంటాం. నిజానికి, ఆ సమయంలో మనం ముందుగా మన అంతరంలోకి వెళ్ళి మన సమయాన్ని అనువుగా మల్చుకోవాలి, సమయాన్ని ఎప్పుడూ రెగ్యులర్‌గా ఉపయోగించే విధంగా కాకుండా అవసరానికి తగ్గట్లుగా క్రొత్తగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనలోని ఆత్రం తగ్గుతుంది.
  4. భగవంతుడిని కొన్ని క్షణాలు మీకు తోడుగా పెట్టుకుని వారినుండి మార్గదర్శన తీసుకోండి – ఒక్కోసారి, ఆఫీసులోగానీ కుటుంబంలోగానీ, చేయాల్సిన పనులు, గడువు దగ్గరపడుతున్న పనులు ఉన్నప్పుడు మనం మన మనసును, బుద్ధిని భగవంతుడితో జోడించి వారి నుండి మార్గదర్శన తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన మనసు స్థిరంగా అయ్యి, హడావుడి పడకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇది మన మనసును మరింత వ్యవస్థీకృతంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది.
  5. అవసరమైనవాటినే చదవండి, వినండి – చాలాసార్లు మనం అతిగా ఆలోచించడానికి, హడావుడి పడటానికి కారణం – మనం మన రోజును వార్తాపత్రికను చదవుతూ, టి.వీ చూస్తూ మొదలుపెడుతుంటాము, ఇతరులు ఏమి చేస్తున్నారనే చర్చే ఎక్కువ ఉంటుంది, ఇదంతా అవసరం లేదు. మంచిని, అవసరమైనవాటినే మనం చదవాలి, వినాలి మరియు మాట్లాడాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »
11th jan 2025 soul sustenance telugu

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు

Read More »