24th feb soul sustenance - telugu

మీరు మానసికంగా అధిక బరువుతో ఉన్నారా?

అధిక శారీరక బరువును నివారించడానికి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం సాధారణం. కానీ మనం  అధిక ఎమోషన్స్ యొక్క బరువు గురించి శ్రద్ధ చూపుతున్నామా? మనం  అనవసరమైన ఆలోచనలు, బాధాకరమైన భావాలు, పరిమిత నమ్మకాలు, అధిక మోతాదులో విషయాలు పొరలు పొరలుగా పోగు చేసాము. ఫిజికల్ ఫిట్‌నెస్, వెయిట్ లాస్ థెరపీలు మరియు డైట్ చార్ట్‌ల గురించి మనం ఈరోజుల్లో చూస్తున్నంత ఎక్కువ అవగాహన ఎప్పుడూ లేదు. మనమందరం శారీరకంగా అధిక బరువు లేకుండా చర్యలు తీసుకుంటాము. కానీ ఎమోషన్స్ యొక్క విషయానికి వస్తే, మనం మోస్తున్న భారీ నెగెటివ్ బరువు గురించి కూడా మనకు తెలియనే తెలియదు.

  1. మీరు మీ మనస్సులో ఉంచుకున్న ఎమోషన్స్ ను మరెవరూ శుభ్రం చేయలేరు. ఎమోషన్స్ ను క్లియర్ చేసుకోవడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి మరియు ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినండి.
  2. మీ గురించి మరియు ఇతర వ్యక్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి అనుభూతి చెందుతున్నారనే దానిపై శ్రద్ధ వహించండి. వారిని స్వీకరించి గౌరవించండి.  గాసిప్, జడ్జ్మెంట్ మరియు విమర్శలకు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరి కోసం సరి అయినది ఆలోచించండి. మీరు ఇతరులను కాపీ చేయకుండా, ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడకుండా మీరు మీలా ఉండండి. 
  3. చిన్న చిన్న పరిస్థితులను జీవితంలో సవాళ్లుగా ముద్రించకండి. ఎంతటి చెడు  జరిగినప్పటికీ నేను దీన్ని మరచిపోలేను లేదా నేను ఈ వ్యక్తిని క్షమించలేను అని అనకండి . గతాన్ని వదిలేయడం ఒక్క ఆలోచన దూరంలో ఉంది.
  4. ఆంతరికంగా తేలికగా ఉండటం మీ ప్రాధాన్యతగా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ జీవనశైలిలో స్వచ్ఛత మరియు పాజిటివిటీను ఎంచుకోండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని సాధించడంలో క్రమశిక్షణతో ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »