24th jan 2023 - sst

ప్రియమైన వ్యక్తి మరణంతో వ్యవహరించడానికి 5 చిట్కాలు

1. స్వయాన్ని మరియు ప్రియమైన ఆ వ్యక్తిని ఆత్మగా భావించండి – మీ కుటుంబం ఆకస్మిక మరణం చూసిన మరుక్షణం నుంచి ప్రతిరోజూ కొన్ని సార్లు మీకు మీరు ఇలా గుర్తుచేసుకోండి – నేను మరియు మమ్మల్ని విడిచిపెట్టిన ఆ ప్రియమైన వ్యక్తి విశేషమైన మరియు ప్రత్యేకమైన వారు …. మేము వైబ్రేషన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నాము … మేము ఆ ఆత్మకు శాంతి, ప్రేమ మరియు శక్తి యొక్క ప్రకంపనలను ప్రసరింపజేస్తున్నాము … ఆ ఆత్మ తన క్రొత్త ఇంటిలో క్రొత్త కుటుంబంతో సంతోషంగా ఉంది …

2. మీ ఇంటిలో ఒక సామూహిక పాజిటివ్ స్పృహను తయారుచేయండి – మీ ఆలోచనలు శక్తివంతంగా మరియు వివేకంతో నిండినవి కానట్లయితే తమ వారిని కోల్పోవడం మీకు మరియు మీ కుటుంబానికి బాధ కలిగించవచ్చు. కాబట్టి మొత్తం కుటుంబం వారు ఆధ్యాత్మిక శక్తితో పాటు ఆత్మిక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబమంతా కలిసి ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన విషయాలు చదవడం, వినడం ద్వారా అందరూ శక్తివంతంగా అవుతారు.

3. మీ సంభాషణలను పాజిటివ్ గా మరియు శక్తివంతంగా మార్చుకోండి – కుటుంబ సభ్యునిగా మీ కుటుంబం యొక్క భావోద్వేగ బాధ్యతను తీసుకోవడం చాలా ముఖ్యం. నిస్సహాయత మరియు విచారం యొక్క ప్రతికూల సంభాషణలలో ఎవరూ పాల్గొనకుండా చూసుకోండి. మీ కోసం, మీ కుటుంబం మరియు ప్రియమైన వారి కోసం మీ మాటలు పాజిటివ్ గా మరియు శక్తితో నిండినప్పుడు, అది కుటుంబంలో ఒకరికొకరు సపోర్ట్ యొక్క వైబ్రేషన్స్ తయారు అవుతాయి.

4. ఇతరుల నుండి ఎటువంటి బాధని తీసుకోవద్దు – మరణం తర్వాత ఉండే ప్రతికూల వాతావరణంలో, భగవంతుని తో సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యం. ఇతర కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి బాధను తీసుకుంటూ నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. కుటుంబం సభ్యులందరు పరస్పరంలో మరియు భగవంతునితో ప్రతి క్షణం ఎంత ఐక్యంగా ఉంటే, అది మరింత స్థిరంగా ఉంటారు.

5. భవిష్యత్తు కోసం సానుకూల దృక్పథాన్ని సృష్టించండి – ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం కుటుంబాన్ని కలవరపెడుతున్నప్పుడు, ప్రతి ఒక్కరూ ముందుకు సాగడం మరియు పాజిటివ్ కర్మలు, అలవాట్లలో తనను తాను బిజీగా ఉంచుకోవాలి. పాజిటివ్ వ్యక్తులతో మాత్రమే సంభాషించే లక్ష్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం. . జీవితం యొక్క కఠిన సమయాలలో పాజిటివ్ శక్తి పెంచుకుంటూ, ఇతరులతో పాజిటివ్ శక్తి ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా ఆత్మ యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా మెరుగు పడతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4)

9th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 4) గాలి శుద్దీకరణ – గాలి మన చుట్టూ నిరంతరం ఉంటుంది మరియు మనం దానిని ఎల్లప్పుడూ  పీల్చుకుంటాము. భౌతిక

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3)

8th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 3) నీటి శుద్దీకరణ – మనం త్రాగే నీటిని శుద్ధి చేయడం కోసం, మనం భౌతిక మార్గాలను మాత్రమే కాకుండా,

Read More »
మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2)

7th Jun – జీవన విలువలు

మంచి ఆరోగ్యం కోసం ఆహారం, నీరు మరియు గాలిని శుద్ధి చేయడం (పార్ట్ 2) ప్రకృతి నుండి మనం తీసుకునే ఆహారం, నీరు మరియు గాలి భౌతిక మరియు భౌతికేతర రెండు రకాలుగా ఎలా

Read More »