రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 1)

రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 1)

పరమాత్ముడు ఈ కలియుగం లేదా ఇనుప యుగం అంతిమ సమయంలో మనకు రాజయోగాన్ని బోధిస్తున్నారు. భారతదేశంలో రాజయోగం అతి ప్రాచీనమైనది. అనేకులు రాజయోగం నుండి ప్రయోజనం పొందారు. అయితే 5000 సంవత్సరాల క్రితం ఇనుప యుగం లేదా కలియుగం అంతిమంలో పరమాత్ముడు సత్యమైన రాజయోగాన్ని బోధించారని ఎవరికీ తెలియదు. అలాగే, ఆత్మలు రాజయోగంలో ఉన్న 4 సబ్జెక్టులు నేర్చుకొని సాధన చేయడం ద్వారా పవిత్రమైయ్యారని ఎవరికీ తెలియదు. పవిత్రమై, ఆత్మలు తమ  స్వచ్ఛత, శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క ఉన్నతమైన మనస్థితికి వెళ్లడంతో స్వర్ణయుగం లేదా సత్య యుగము సృష్టించబడిందని ఎవరికీ తెలియదు. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు, మనం మళ్లీ కలియుగం అంతిమంలోకి వచ్చాము. 5000 సంవత్సరాలలో అనేక జన్మల ప్రయాణం తర్వాత ప్రపంచంలోని ఆత్మలందరూ అపవిత్రంగా మారారు. కాబట్టి ఇప్పుడు, భగవంతుడు మనకు రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు బోధించడం ద్వారా మళ్లీ స్వర్ణయుగాన్ని స్థాపిస్తున్నారు. ఈ 4 సబ్జెక్టులు ఏమిటి మరియు వాటి ప్రాముఖ్యత ఏమిటి అని అర్థం చేసుకుందాం –

  1. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విని ధారణ చేయడం – ఆధ్యాత్మిక జ్ఞానం రాజయోగం యొక్క మొదటి సబ్జెక్టు. దీనిలో ఆత్మ, ఆత్మ యొక్క రూపం, నిజగుణాలు, ఇల్లు మరియు పునర్జన్మల గురించి భగవంతుడు మనకు బోధిస్తారు. అలాగే, పరమాత్ముడు తన గురించిన పూర్తి జ్ఞానాన్ని అనగా వారి నామం, రూపం, గుణాలు, ఇల్లు మరియు ప్రపంచ నాటకంలో వారి పాత్ర, మనతో పంచుకుంటారు.  అంతేకాక ఈ సృష్టి నాటకం, దాని వ్యవధి,  దాని యుగాలు మరియు దాని యదార్ధ చరిత్ర మరియు భౌగోళికం కూడా మనకు బోధిస్తారు. ఈ భూమిపై ప్రపంచ నాటకం జరుగుతుందని వారు బోధించారు, ఇందులో ఆత్మలు మరియు పరమాత్ముడు వేర్వేరు పాత్రలను పోషిస్తారు. ఆత్మలు ప్రకృతితో  సంబంధం కలిగి ఉంటాయి. మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుని పరమాత్ముడు నుండి ప్రతిరోజూ వింటాము. ఇది మనల్ని జ్ఞానవంతులను చేయడమే కాకుండా, మనలో శాంతి, ఆనందం మరియు శక్తిని నింపుతుంది. మనం రోజంతా కర్మలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వినే జ్ఞానాన్ని మనసులో  ఉంచుకోవాలని పరమాత్ముడు మనకు చెప్తున్నారు. ఇది రోజంతా మనల్ని పాజిటివ్ గా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

(రేపు కొనసాగుతుంది…) 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »