లాభదాయకమైన కర్మ బ్యాలెన్స్

లాభదాయకమైన కర్మ బ్యాలెన్స్

మనం మన కర్మల బ్యాలెన్స్ షీట్‌ని ఆడిట్ చేస్తే, మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనల మొత్తం – సరైన మరియు తప్పు కర్మలుగా వర్గీకరించబడి ఉంటాయి. మన కర్మలు లాభదాయకంగా ఉండాలని మనం కోరుకుంటాము కావున,  మన కర్మల బ్యాలెన్స్ షీట్ మనం లాభాలను అనుభవిస్తున్నామో మరియు నష్టాలను అనుభవిస్తామో నిర్ణయిస్తుంది. మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య ఒక కర్మకు సమానం. మన కర్మలన్నింటినీ మన కర్మల  బ్యాలెన్స్ షీట్‌లో లిస్ట్ చేయవచ్చు. మనం మంచి కర్మలను కూడబెట్టినట్లయితే, బ్యాలెన్స్ షీట్ లాభదాయకంగా ఉంటుంది, అంటే కర్మ పరిణామాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి తప్పు కర్మ నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది.

మీ కర్మ లాభాలను పెంచుకోవడానికి ఈ దశలను అనుసరించండి –

  1. మీ ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మీ కర్మ. పరిస్థితులు మరియు వ్యక్తుల ప్రవర్తన పరిణామాలు, అవి మీ భాగ్యం.
  2. కర్మను ఎంచుకున్నపుడే మీరు దాని పర్యవసానాన్ని కూడా ఎంచుకున్నారు. మనుష్యుల కర్మలు వారి భాగ్యాన్ని వ్రాస్తాయి అని గుర్తుంచుకోండి. మీ స్పందన మీ భాగ్యాన్ని వ్రాస్తుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా సరైన కర్మలను చేయండి.
  3. పంచుకోండి, శ్రద్ధ వహించండి, సహకరించండి, క్షమించండి, ఆనందాన్ని ప్రసరింపజేయండి. మీరు ఆశించిన ఫలితాలను పొందకపోయినా, మీ కర్మలు క్షీణించవద్దు.
  4. ఈ రోజు మీకున్నది గతం యొక్క రిటర్న్ మాత్రమే అని అంగీకరించి మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోండి. వర్తమానంలో చేసే సరైన కర్మలతో, గత కర్మల ఖాతాలను సెటిల్ చేసుకోండి.

మీ కర్మ ఖాతాలపై శ్రద్ధ వహించడానికి మరియు మీ లాభాలను అంచనా వేయడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాలను రిపీట్ చేయండి.

నేను వివేకవంతమైన వ్యక్తిని … నేను స్వచ్ఛమైన ఉద్దేశాలను రచిస్తాను .. … సరైన ఆలోచనలు … పరిపూర్ణ ప్రవర్తనలు … నేను అందరికీ ప్రేమను ఇస్తాను … ఆనందాన్ని ప్రసరిస్తాను … … ప్రతి సన్నివేశంలో … పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు … నా కర్మ సరైనది … వ్యక్తులు నాతో మంచిగా ఉండకపోవచ్చు ….. అది వారి కర్మ … నేను నా కర్మపై మాత్రమే దృష్టి పెడతాను … సహనం, శాంతి నా పాజిటివ్ కర్మలు  … నేను నా కర్మల  బ్యాలెన్స్ షీట్ ని  చెక్ చేసుకుంటాను … కర్మ అంటే నిస్వార్థంగా ఇవ్వడం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »