24th march soul sustenance telugu

కర్మ సిద్ధాంతం ఎలా పని చేస్తుంది?

మనమందరం ఆధ్యాత్మిక శక్తులం  లేదా ఆత్మలం . ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాము. మనమందరం ప్రపంచ నాటకంలో శరీర బ్రాంతిలో కొన్ని మంచి కర్మలు , కొన్ని చెడు కర్మలు చేశాము. మనలో కొంతమందికి మన కర్మల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది, కొంతమందికి తక్కువ అవగాహన ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రపంచ నాటకంలో మనం  అనేక  జన్మలు తీసుకుంటూ అనేక రకాల అనుభవాలను ఎదుర్కొన్నాము, అవి మన సంస్కారాలను ప్రభావితం చేయడమే కాకుండా, మన మనస్సుతో పాటు బుద్ధిని కూడా ప్రభావితం చేశాయి. తత్ఫలితంగా, జీవితం, జీవిత పరిస్థితులు, పాజిటివిటీ, స్వచ్ఛత, మంచితనం, ఆత్మ సాక్షాత్కారం మరియు భగవంతుని గురించి మన నమ్మకాలు కాలక్రమేణా మారాయి. అలాగే, మనమందరం వివిధ రకాల సమాచారం, విభిన్న సంబంధాలు, వివిధ జన్మలలోని విభిన్న జీవిత దృశ్యాలను చూసాము, ఇవి మన చేతనాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేశాయి.  ఈ రోజు మన ఆలోచనలు మరియు నమ్మకాలు ఇలా ఉన్నాయి. అందుకే ఈరోజు కొంతమంది తమ ప్రతి కర్మ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు,  కొందరు అదే విషయంలో అంత జాగ్రత్తగా ఉండరు. కానీ కర్మ సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఆత్మిక స్వరూపం   మరియు శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం , పవిత్రత, శక్తి మరియు జ్ఞానం వంటి దివ్య గుణాల ప్రభావంతో చేసే కర్మలు మనకు మరింత ఆనందాన్ని ఇస్తాయి. మన జీవితాలలో మంచి మరియు పాజిటివ్  పరిస్థితులను ఆకర్షిస్తాయి. శరీర భ్రాంతితో మరియు వికారాలతో అనగా కామం, కోపం, దురాశ, మోహం , అహంకారం, అసూయ, ద్వేషం మరియు మోసం వంటి దుర్గుణాలతో చేసే కర్మలు మనకు దుఃఖాన్ని ఇస్తాయి మరియు మన జీవితంలో మరింత నెగెటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాయి.

ప్రపంచ నాటకంలో భగవంతుడు మాత్రమే పాత్రను పోషిస్తున్నప్పుడు నిరంతరం ఆత్మ చైతన్యంతో ఉంటాడు. వారు మానవ ఆత్మల వలె అతని కర్మల ఫలాన్ని పొందరు ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు , గుణాల సాగరుడు మరియు శక్తుల సాగరుడు. వారు మాత్రమే ప్రపంచ నాటకంలో ఏమాత్రం మారరు . వారు శాశ్వతమైన వారు. సదా సంపన్నులు. మానవ ఆత్మలకు మరియు ప్రకృతికి నిరంతరం దాత.   ఎవరి నుండి లేదా ప్రకృతి నుండి ఎప్పుడూ ఏమీ తీసుకోరు. ప్రపంచ నాటకం స్వర్ణ మరియు వెండి యుగాలలో ఉన్నప్పుడు మానవ ఆత్మలు ఆత్మిక స్వరూపంలో ఉంటారు మరియు రాగి , ఇనుప యుగం లో ఉన్నప్పుడు శారీరిక భ్రాంతిలో  ఉంటారు. అందుకే మొదటి రెండు యుగాలలో దుఃఖం ఉండదు. దుఃఖం రాగి యుగంలో మాత్రమే ప్రారంభమవుతుంది మరియు ప్రపంచ నాటకం రాగి యుగాన్ని దాటి ఇనుప యుగానికి వచ్చేసరికి దుఃఖం పెరుగుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd-sept-2023-soul-sustenance-telugu

ట్రాఫిక్ జామ్ – రోడ్డుపైనా లేక మనసులోనా?

మనలో చాలా మందికి, ట్రాఫిక్ రద్దీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో  జాప్యం, ఫ్లైట్ మిస్ అవ్వటం లేదా క్యూలలో వేచి ఉండటం నిరాశ, ఒత్తిడి మరియు ఆందోళనకు మూలాలు. ఇవి రొటీన్ కావచ్చు, కావున

Read More »
21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »