Hin

సంతుష్టత - ధారణ చేసి రేడియేట్ చేయండి

సంతుష్టత - ధారణ చేసి రేడియేట్ చేయండి

మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం, మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడం. మనము ఇది చెక్ చేసుకుందాము –  నా జీవితంలో ఈ అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత, నేను సంతుష్టంగా ఉంటాను అని చెప్పుకుంటున్నానా, లేదా నేను ప్రస్తుతం సంతుష్టంగా ఉండి మరింత మెరుగుపరచడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకుంటున్నానా. సంతుష్టత అంటే మనకు సాధించాలనే కోరిక లేదని కాదు. దీని అర్థం మనము ఇప్పటికే సంతృప్తిగా ఉన్నాము మరియు మా భవిష్యత్తును మెరుగుపరచడానికి మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము. లక్ష్యాలను సాధించడం, బాగా పని చేయడం, సౌకర్యవంతమైన జీవితాలను గడుపుతున్నపటికీ ఎప్పుడూ సంతృప్తి చెందని వ్యక్తులను మీరు చూసే ఉంటారు.  అలాగే, ఏదీ  సాధించకుండా, జీవితంలో చాలా సంతృప్తిగా ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా మీరు కలిసి ఉంటారు.  సంతుష్టత మరియు సాఫల్యం మధ్య ఉన్న లింక్ ఏంటి అని మిమ్మల్ని ఇది ఆలోచించేలా చేస్తుంది కదా ? సంతుష్టత, మనము ఎవరము, మన వద్ద ఏముంది లేదా ఏమి సాధించాము అన్నదానికి సంబంధము లేనిది. అది, ఇప్పుడు ఉన్న దానితో సంతోషంగా ఉంటూ మరిన్నింటి కోసం కృషి చేయడం అనే ఒక అందమైన గుణం. బాహ్య పరిస్థితులు మరియు వ్యక్తులతో సంబంధం లేకుండా సంతుష్టతను పెంపొందించుకోవాలి. సంతుష్టంగా ఉండటం అంటే మనం ఉపసంహరించుకోవడం, బద్ధకంగా ఉండడం, సాధించడం మానేయడం లేదా మన వద్ద ఉన్నదానితో స్థిరపడడం అని అర్థం కాదు. దాని అర్థము, ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ – అంటే  మనం ఎవరు, మనకు మరియు మన చుట్టూ ఏమి జరుగుతుందో మరియు మనం ఉన్న వ్యక్తులతో – ప్రతిదీ సరిగ్గానే ఉంది మరియు మేము తదుపరి విషయాలపై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. సంతుష్టంగా ఉండాలంటే ఒక్క ఆలోచన చాలు. పరిస్థితుల పట్ల మీ సంతుష్టత యొక్క ఎనర్జీ పోజిటివిటీ కి ఇందనం మరియు శక్తి వంటిది. 

రోజును ప్రారంభించే ముందు, మీరు ఒక సంతుష్ట జీవి అని ప్రతిరోజూ గుర్తు చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి సన్నివేశంతో, మీతో, మీ కుటుంబంతో, మీ పనితో, మీకు ఏమి జరుగుతుందో, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండండి. అంతా బాగానే ఉంది, ఏ విధంగా జరగాలో అలాగే జరుగుతోంది, మీరు ఉన్న తీరు పరిపూర్ణంగా ఉంది, మీకు ఉన్నది సరిపోతుంది మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు పరిస్థితులు సరైనవి. మీ సంతుష్టత మీ ఆంతరిక సంతోషం మరియు శాంతికి ప్రతిబింబం. మీరు సంతుష్టతను అనుభవం చేయడానికి బయట ఏదీ పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. మీ లక్ష్యాల కోసం కృషి చేస్తున్నప్పుడు మీ శాంతి, ప్రేమ మరియు సంతోషం అనే విలువలపై ఎప్పుడూ రాజీపడకండి. మీ సంతుష్టత అనేది మీరు సాధించిన వాటిపై ఆధారపడి ఉండదు. మీకున్న దానితో సంతుష్టంగా ఉండండి. సంతుష్టంగా ఉంటూ ప్రగతి కొరకు పని చేయండి, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోండి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి, అర్థవంతమైన లక్ష్యాలను సాధించండి మరియు స్వీయ-అభివృద్ధి కోసం పని చేయండి. ప్రతి సన్నివేశానికి మీ ఉన్నతమైన వైబ్రేషన్‌ని రేడియేట్ చేయండి. ప్రతి సన్నివేశానికి మీ శాంతి, స్వచ్ఛత మరియు శక్తిని రేడియేట్ చేయండి మరియు తదుపరి సన్నివేశం యొక్క శక్తిని ఉన్నతంగా చేయండి. పోటీకి బదులు అందరికి సహకరించండి. లోలోపల నుండి మీరు సృష్టించే పాజిటివిటీ, ఇతరుల నుండి మీరు పొందే ఆశీర్వాదాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతుష్టంగా, సంతోషంగా మరియు విజయవంతంగా ఉంచుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

30th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ లక్ష్యాలను సాధించేటప్పుడు మనం ఎంత వినయంగా మరియు నిజాయితీగా ఉన్నాము అనేదే మన విజయం. నమ్రత అన్నింటికంటే గొప్ప

Read More »
29th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు విజయం అంటే మన జీవతపు క్వాలిటి పెరగడం. మనం ఖరీదైన కారు,  ఖరీదైన బట్టలు కొనుగోలు చేసి  గర్వపడతాము. కొన్నిసార్లు ఈ

Read More »
28th april 2025 soul sustenance telugu

విజయం యొక్క 5 అందమైన అంశాలు (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మనకు మరియు ఇతరులకు సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో ప్రయోజనం చేకూర్చే పనులు చేసే ప్రత్యేకమైన వారము. ఉద్యోగంలో, మార్కెట్‌కు వెళ్లేటప్పుడు,

Read More »