సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 1)

సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 1)

ఉరుకుల పరుగుల ఈ ప్రపంచంలో, పెద్ద మనసు చేసుకుని, మనల్ని కలిసినవారికి మనలోని ప్రత్యేకతలు, ప్రేమ అనే సుగంధాన్ని ఎంత పంచాము అని చూసుకోవాలి. మీరు చేసే ప్రతి పని వలన మీకు మాత్రమే కాకుండా ఇతరులకు ఎంత మేలు చేసారని పరిశీలించుకోండి. మన దైనందిన జీవితం రకరకాల పనులతో ముడిపడి ఉంటుందని మనందరికీ తెలుసు, కానీ జీవితం అంటే శాంతి, ప్రేమ మరియు సంతోషము అనే అందమైన వాటిని ఇవ్వడము, తీసుకోవడము. పనిలో బిజీగా ఉండటం మంచిదే కానీ పని చేస్తూ కూడా కొందరు తమలోని మంచితనానికి దగ్గరగా ఉంటారు. కొందరైతే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మంచి విషయాలను వారి మాటలతో, హావభావాలతో పంచుతారు. మరికొందరు తమకు తెలిసిన మంచిని ఈ మెయిల్ ద్వారాగానీ సామాజిక మాధ్యమాల ద్వారాగానీ పంచుతుంటారు, ఆఫీసులో పనిచేసేవారు కాకుండా ఇంట్లో ఉండేవారు కూడా ఇలా చేస్తుంటారు.

కనుక, జీవితమంటే ఎప్పుడూ కష్టపడి బ్రతకడమే కాదు, సుగుణాలను ఆధారంగా చేసుకుని జీవించడము మరియు ఆ సుగుణాల సుగంధాన్ని అందరికీ పంచడము. విలువలను మీలో ఉంచుకోవడం కాదు, వాటిని పెద్ద మనసుతో అందరికీ పంచాలి. మంచి ఆలోచనలను కొంతమంది వారి ఇంట్లోగానీ ఆఫీసులోగానీ రోజూ పెడుతుంటారు తద్వారా అందరూ దానిని చదివి, ప్రేరణను పొంది, చేతల్లోకి తీసుకువచ్చి, ఇతరులనూ ప్రేరేపిస్తుంటారు. ఇదే సానుకూల ఆలోచన ఆధారిత జీవనం. చాలామందిలా సాదసీదాగా ఏదో జీవిస్తున్నాము అన్నట్లుగా జీవించకూడదు. జీవితాన్ని పూర్తిగా జీవించండి, ఆస్వాదించండి కానీ విలువలను పణంగా పెట్టి కాదు. మీరు మీ వ్యక్తిత్వంలో, మీకున్న కళలలో ప్రత్యేకమైనవారు అనిపించుకోవడమే కాదు, మీ స్వభావం మరియు సుగుణాలలో కూడా మీరు మేటి అనిపించుకోండి. అప్పుడు ఈ ప్రపంచం జీవించడానికి ఒక అందమైన ప్రదేశంగా మారుతుంది, ప్రేమ మరియు సంతోషాలతో అందంగా పెనవేసుకున్న ఒక పెద్ద  కుటుంబంలా అవుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »