25th feb soul sustenance telugu - brahma kumaris | official

భగవంతునితో ఒక అందమైన కొత్త ప్రయాణం ప్రారంభించండి (భాగం 1)

భగవంతుడుని దగ్గరగా తెలుసుకోవడంలో మొగ్గు చూపే వారి ఎదురుగా మనోహరమైన ప్రయాణం ఉంటుంది. ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ఈ అత్యంత ఆసక్తికరమైన ప్రయాణానికి వాహనం ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ వాహనంలో కూర్చోకుండా నేను ప్రయాణం చేయలేను. నేను ఈ వాహనంలో కూర్చోగానే ఒక కొత్త, అందమైన, ప్రశాంతమైన, ప్రేమ మరియు ఆనందకరమైన వ్యక్తిత్వం, జ్ఞానం, గుణాలు, శక్తులు, ఆనందం మరియు ఆశీర్వాదాల సంపదతో ఆధ్యాత్మికంగా సంపన్నమైన వ్యక్తిత్వం నాకు పరిచయం చేయబడింది, అందరూ ఆ వ్యక్తిత్వాన్ని భగవంతుడు అని పిలుస్తారు.
వారు తనను తాను ఒక సూక్ష్మమైన బిందువుగా, చాలా సరళంగా మరియు సాదాసీదాగా పరిచయం చేసుకునే వ్యక్తిత్వం. ఆ సరళమైన బిందువులో, గుప్త రూపంలో అపారమైన అనుభవం, జ్ఞానం మరియు లోతు ఎంతగా ఉందంటే జీవితకాలం వారి సహవాసంలో ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో గడిపినా , మీరు వారిని పూర్తిగా తెలుసుకోలేరు. మీరు ఆ బిందువులో ఉన్న జ్ఞాన సముద్రంలోకి ఎంత లోతుగా వెళ్తారో, అంత ఎక్కువగా జ్ఞానం మరియు అనుభవాల యొక్క మరిన్ని సంపదలను పొందుతారు. భగవంతుడు అనే ఈ కొత్త సహచరుడితో మీరు కనెక్ట్ అయిన ప్రతిసారీ, మీలో ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది మరియు మీలో శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి పెరుగుతుంది. మీరు ఈ ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత, మీరు మళ్లీ ఎప్పటికీ ఒకేలా ఉండరు. మీరు అతని సహవాసంలో ఎంత సమయం గడుపుతారో, అంత వారి నుండి జ్ఞానాన్ని పొందడం లేదా మెడిటేషన్ సమయంలో వారిను స్మరించుకోవడం లేదా ఈ ప్రయాణం యొక్క ప్రయోజనాలను ఇతర స్నేహితులు మరియు బంధువులకు రుచి చూసేందుకు వారితో పంచుకోవడం; మీరు వీటిలో దేనినైనా కొన్ని నిమిషాలు లేదా ఒక గంట పాటు చేసినా, మీలో ఎల్లప్పుడూ సూక్ష్మమైన ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు అభివృద్ధి యొక్క అనుభవం ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »