25th January -sst

స్వయం కోసం ఇచ్చిన నెగిటివ్ లేబుల్‌లను మార్చు కోవడం

వ్యక్తుల అభిప్రాయాలను లేదా మన స్వంత అవగాహనను ఉపయోగించి, మనం కొన్నిసార్లు మనపై లేబుల్‌లను పెట్టుకుంటాము – నేను నెమ్మదిగా ఉన్నాను, నేను దూకుడుగా ఉన్నాను. స్వయానికి ఇచ్చిన లేబుల్స్ ను పదేపదే గుర్తు తెచ్చుకుంటే మనలో అదే విధమైన ప్రవర్తనను పెంచుతాయి. మనం మనపై పెట్టుకునే లేబుల్స్ లేదా వ్యక్తులు మనకు ఇచ్చిన లేబుల్స్ మన వ్యక్తిత్వం గురించి అదే విధమైన ఆలోచనలు మరియు పదాలుగా మారతాయి. మేము మా లేబుల్‌లను మార్చాలని నిర్ణయించుకునే లోపే అవి మన వాస్తవికతగా మారతాయి.
1. మీ చిన్ననాటి నుండి, వ్యక్తులు మీ తప్పుడు అలవాట్లు లేదా ప్రవర్తనల గురించి కొన్ని విషయాలను చెప్పే వారు లేదో చెక్ చేసు చేయండి. వారి భావాలు స్వచ్ఛమైనవి మరియు మీరు మారాలని వారు కోరుకున్నారు. కానీ మీరు సోమరి లేదా మీరు అజాగ్రత్తగా ఉన్నారు వంటి నెగిటివ్ లేబుల్‌లను వారు మీకు ఇచ్చారు.

2. వ్యక్తులు మీకు ఇచ్చిన లేబుల్‌లను మీరు అంగీకరించి, వాటిని మీ గుర్తింపుగా మార్చుకొని ఉండవచ్చు , తద్వారా సోమరితనం లేదా అజాగ్రత్తగా ఉండే వ్యక్తిత్వ లక్షణాన్నిమీరు మాటి మాటికి ఆలోచించి ఉండవచ్చు . మీరు పదేపదే నేను అలా ఉన్నాను అని అనుకున్నపుడు , మీరు దానిని బలపరుస్తున్నారు . అంతే ఇది మీరు ఎవరు అని మీరు అనుకున్నారో అలా అయ్యారు.

3. మీరు ఇతరుల నుండి స్వీకరించిన మరియు ఇప్పటికీ పట్టుకొని ఉన్న అన్ని నెగిటివ్ లేబుల్‌ల జాబితాను తయారుచేసుకోండి. కాలక్రమేన, అవి మీ వ్యక్తిత్వంగా ఏర్పడి మీ మాటలలో భాగంగా మారాయి. మీ విజయానికి మరియు ఆనందానికి ఆటంకం కలిగిస్తున్నాయి.

4. మీరు మీ గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారేమో చెక్ చేసుకోండి. ఇది వాస్తవం అయినప్పటికీ, వాటిని స్వచ్ఛమైన, పాజిటివ్ లేబుల్‌లతో మార్చండి . ఇది మీ పాజిటివ్ వ్యక్తిత్వంగా మారే వరకు కొన్ని రోజులు దీన్ని రిపీట్ చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »