రాజయోగం యొక్క 4 సబ్జెక్ట్లు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 2)

రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 2)

  1. మెడిటేషన్ లో భగవంతునితో కనెక్ట్ అవ్వడం – మెడిటేషన్ అనేది రాజయోగం యొక్క తదుపరి సబ్జెక్టు. మనం మొదట ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకుని, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం దానిని ఆచరించగలము. మెడిటేషన్ అనేది ఆత్మ-పరమాత్మల కనెక్షన్, దీనిలో ఆత్మ మొదట తనను తాను అర్థం చేసుకొని, తన రూపాన్ని మరియు గుణాలను విజుయవలైజ్ చేసుకొని అనుభూతి పొందుతుంది. ఆత్మ జ్ఞానం ఆధారంగా తనతో తాను మాట్లాడుకొని  పాజిటివ్ ఆలోచనలతో శ్రేష్టమైన మానసిక స్థితిని తయారు చేసుకుంటుంది. మెడిటేషన్ లో  ఆత్మ తన మనస్సు మరియు బుద్ధి ద్వారా జ్ఞానం ఉపయోగించి భగవంతుడు లేదా పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. మెడిటేషన్ అంటే ఆత్మ, పరమాత్మతో చేసే సూక్ష్మ సంభాషణ. మెడిటేషన్ ఒక క్లీనింగ్ చేసే విధానం. దీనిలో భగవంతుని వైబ్రేషన్స్  స్వీకరించడం ద్వారా మనస్సు, బుద్ధి మరియు సంస్కారాలు పూర్తిగా శుభ్రపరచబడతాయి. మెడిటేషన్ అనేది ఒక ఛార్జింగ్ ప్రక్రియ, దీనిలో ఆత్మలో  ఉన్న ఆంతరిక శక్తులు మేల్కొంటాయి. మెడిటేషన్ లో, ఆత్మ భగవంతుని గుణాలను మరియు శక్తులను పొందుతుంది, తనను తాను మంచితనంతో మార్చుకుంటుంది. మెడిటేషన్, భగవంతునితో మన సాన్నిహిత్యాన్ని కూడా పెంచి మన చర్యలలో మనల్ని తేలికగా మరియు సంతోషంగా చేస్తుంది, మన జీవితంలోని వివిధ రంగాలలో మనల్ని మరింత సమర్థవంతంగా మరియు ఉత్పాదకంగా మారుస్తుంది. చివరగా, మెడిటేషన్ మన చర్యలను మరింత అందంగా మరియు స్వభావాన్ని పరిపూర్ణంగా చేసి ఎటువంటి బలహీనతలు లేకుండా చేస్తుంది.
  2. దివ్య గుణాలను ధారణ చేయటం – ఇది రాజయోగం యొక్క మూడవ సబ్జెక్టు. ఇది చాలా ముఖ్యమైనది. మన జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నామో మరియు ఎంత సమర్ధవంతంగా అభ్యసిస్తున్నామో అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. దీనికి సంకేతం ఏమిటంటే, మనలో దైవీగుణాలు పెరగడం మొదలవుతుంది మరియు మనం ఇతరులకు మంచిని పంచడం, అందరి నుండి ఆశీర్వాదాలు ఇచ్చి పుచ్చుకోవడం ప్రారంభిస్తాము. మనలో ఆధ్యాత్మిక శక్తి ఎంత పెరిగితే, అంతగా మన వ్యక్తిత్వంలో గుణాలు కనిపించడం మొదలవుతుంది. అలాగే, మనం భగవంతుని గుణాలతో  నిండి పోయి మనం వారి వలె మారడం ప్రారంభిస్తాము. ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో అడుగడుగునా భగవంతుడిని అనుసరిస్తున్నప్పుడు మన మాధుర్యం, స్వచ్ఛత మరియు వినయం పెరుగుతాయి. మనకు గురువు, గైడ్ అయిన భగవంతుడిని మన స్వభావంతో ప్రపంచానికి ప్రత్యక్షం చేస్తాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »