మనం మంచితనం యొక్క వైబ్రేషన్‌ని కలిగి ఉన్నాము అని చెప్పే 5 సంకేతాలు

మనం మంచితనం యొక్క వైబ్రేషన్‌ని కలిగి ఉన్నాము అని చెప్పే 5 సంకేతాలు

మనమందరం ప్రపంచంలోని స్వచ్చమైన ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో అందరికీ మంచిని ప్రసరించడమే మన పాత్ర. మంచితనం యొక్క వైబ్రేషన్ అంటే మంచితనం యొక్క పాజిటివ్ వైబ్రేషన్, ఈ వైబ్రేషన్స్, మనం ఎక్కడికి వెళ్లినా మరియు ఎవరితో సంభాషించినా అందరూ మన నుండి అనుభూతి చెందుతారు. మనం మంచితనం వైబ్రేషన్‌ని కలిగి ఉన్నామని తెలిపే 5 సంకేతాలు ఏమిటి –

  1. శాంతి, ప్రేమ మరియు ఆనందం అనే 3 గుణాల అనుభవంతో మనం నిండుగా ఉంటాం. ఈ  3 గుణాలు మన ముఖంపై మరియు మన వ్యక్తిత్వంలో నిరంతరం కనిపిస్తాయి. మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య ఈ 3 గుణాలను కలిగి ఉంటాయి. రోజంతా మనం కలిసే ప్రతి ఒక్కరూ మన నుండి ఈ గుణాలను అనుభూతి పొంది వాటిని స్వయంలో అనుభూతి చెందుతారు.
  2. నేడు, ప్రతి ఒక్కరూ ఇతరుల నుండి షరతులు లేని మంచితనం కోసం చూస్తున్నారు. భగవంతుని పిల్లలుగా, ప్రపంచానికి మరియు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ, భగవంతుడు మనకు అందించిన మరియు మనలో నింపిన ప్రతిదాన్ని అందించడం మన కర్తవ్యంగా భావించి  గ్రహించినప్పుడు, మనం మంచితనం యొక్క ఏంజెల్ లా అవుతాము. ఏంజెల్ గా అయ్యి మన మంచితనంతో మరియు ఇచ్చే గుణంతో ప్రతి ఒక్కరినీ స్పర్శిస్తాము.
  3. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత భవిష్యత్తు మరియు ప్రపంచ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. మనం మంచితనంతో నిండినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. మనం దివ్య గుణాలతో నిండి మరియు భగవంతుని  జ్ఞానంతో  కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఇది మనలోనికి వస్తుంది. ఈ దైవత్వం మరియు జ్ఞానంతో మన జీవితాలను మరియు ఇతరుల జీవితాలను నింపి, భగవంతుని మంచితనానికి దూతలుగా మారదాం.
  4. మనం కోపం మరియు అహంకారపు సంస్కారాలను విడిచిపెట్టినప్పుడు, మనం మంచితనాన్ని కలిగి ఉంటాము.  అందరూ మనకు దగ్గర అయి మన ఆధ్యాత్మికత యొక్క వైబ్రేషన్స్ కు కనెక్ట్ అవుతారు. ఈ రెండు దుర్గుణాలను విడిచిపెట్టడం పట్ల మనం శ్రద్ధ చూపినప్పుడు సంబంధాలు బలపడతాయి.  మన మంచితనం యొక్క వైబ్రేషన్స్  మన కుటుంబ సభ్యులు మరియు మన కార్యాలయంలోని సహోద్యోగులకు ప్రసరిస్తాయి.
  5. మనం మంచితనం యొక్క వైబ్రేషన్స్  కలిగి ఉన్నప్పుడు, మనం ఎల్లప్పుడూ అందరి నుండి ఆశీర్వాదాలను ఆకర్షిస్తాము.  అందరూ మనతో మరియు మన ప్రతి చర్యతో సహజంగా సంతృప్తి చెందుతారు. మన ఆంతరిక తేలికతనంతో, సంతృప్తి మరియు వినయంతో ప్రతి చర్యను చాలా సులభంగా మరియు అందంగా చేస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకొంటాము. అందువలన జీవితంలోని ఏ రంగంలోనైనా అందరూ మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »