25th march soul sustenance telugu

వ్యక్తులను అనుమానించడం మానేయండి, వారిని విశ్వసించడం ప్రారంభించండి

మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు మనలో కొద్దిమందికి ఉంది. కొన్నిసార్లు ఎవరినైనా అనుమానించడం అనేది వారి వల్ల కాకపోవచ్చు , కేవలం మనకున్న అలవాటు వల్ల కావచ్చు. మన అనారోగ్యకరమైన సందేహాలు, అభద్రతాభావాలు, భయాలు మరియు ఆందోళనలు మన శాంతిని దూరం చేయడమే కాకుండా, ఆ వ్యక్తిని కూడా మన నుండి దూరం చేస్తాయి.

  1. మీరు సహజంగానే ఎవరినైనా విశ్వసించాలని భావిస్తారా మరియు వారిని ఎల్లప్పుడూ విశ్వసించగలరా? అయినప్పటికీ, మీరు వారి ఉద్దేశం, సామర్థ్యాన్ని అనుమానించడానికి ఏదో ఒక కారణం వెతుకుతారా? సందేహం యొక్క అంశం మీ సంబంధం యొక్క పునాదిని ఎలా కదిలిస్తుందో మీరు గ్రహించారా?
  2. ఏదైనా సంబంధం నమ్మకంపై ఆధారపడుతుంది.  కొన్నిసార్లు మనం ఒక వ్యక్తిని విశ్వసిస్తున్నామని చెప్పుకుంటాము, కానీ మనకు మన స్వంత సందేహాలు ఉంటాయి. అనుమానం అనేది పరస్పర గౌరవం, అంగీకారం మరియు ప్రేమను ప్రవహించకుండా అడ్డుకోవడంతో ఈ ఎనర్జీ మనం పంచుకునే బంధాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
  3. వ్యక్తులు విభిన్న వ్యక్తిత్వాలను మరియు విభిన్న ప్రవర్తనలను కలిగి ఉంటారు, కాబట్టి వారు ఎల్లప్పుడూ మన విధంగా ఉండలేరు. కానీ మన విశ్వాసం వ్యక్తులు ఏమి చేస్తారు లేదా వారు ఎలా ప్రవర్తిస్తారు అనే దానితో సంబంధం లేకుండా ఉండాలి. వారు తప్పు చేసినప్పటికీ, మనం వారిని బేషరతుగా విశ్వసిద్దాం ఎందుకంటే ఈ విశ్వాసం వారిని సరియైన పనులు చేయడానికి వారికి శక్తినిస్తుంది.
  4. స్వయానికి మరియు వ్యక్తులకు మీరు వారిని పూర్తిగా విశ్వసిస్తున్నారనే శక్తివంతమైన మెసేజును  పంపండి. నమ్మకం అనేది నా సహజ స్వభావం. ప్రతి ఒక్కరినీ విశ్వసించడం నాకు సౌకర్యంగా ఉంటుంది మరియు ఇతరులను నమ్మదగినదిగా చేస్తుంది అని మీరు మీకు గుర్తు చేసుకోండి. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »
23rd-sept-2023-soul-sustenance-telugu

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి

Read More »