బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు, అంటే తదుపరి 2500 సంవత్సరాలలో, ఆత్మాభిమాని అనే జాగృత అవస్థ నుండి దేవతల స్థితి దేహాభిమానం లోకి రావటం వలన వారిని మానవులు అని పిలవబడతారు. వారు ఒక్క నిరాకార భగవంతుడిని, ఒక్కప్పుడు స్వర్గంలో ఉండేటువంటి  పవిత్రమైన దేవతల  చిహ్నాలు  అనగా దేవి దేవతల మూర్తులను, ఇతర దైవీ ఆత్మలను మరియు రాగి యుగం లేదా ద్వాపరయుగం, ఇనుప యుగం లేదా కలియుగంలో ప్రపంచానికి దైవీ సందేశం ఇవ్వటానికి భూమిపైకి వచ్చిన సాధువులను కూడా పూజించడం ప్రారంభించారు. దానితో భక్తి అనగా భక్తి మార్గం ప్రారంభమయింది. ఈ ప్రపంచాన్ని నరకం అని అంటారు మరియు ఈ ప్రపంచంలో అపవిత్రత, దుఃఖం మరియు అశాంతి ఉన్నాయి. స్వర్గానికి సంబంధించిన అన్ని ప్రాప్తులు నెమ్మదిగా తగ్గి 5000 సంవత్సరాల చివరిలో లేదా ఇనుప యుగం ముగింపులో నామ మాత్రంగా మిగులుతాయి.  ఇది ప్రస్తుత కాలం. స్వర్గంలో, ఒకే రాజ్యం, ఒకే మతం మరియు ఒకే భాష మరియు దేవతల మధ్య సంపూర్ణ ఐక్యత ఉంటుంది. నరకంలో అనేక విభిన్న ప్రభుత్వాలు, మతాలు మరియు భాషలు ఉన్నాయి మరియు ప్రజల మధ్య ఐక్యత లోపించింది.

ఈ ప్రపంచ నాటకం గురించి స్పష్టంగా తెలిసినది ఒక్క భగవంతుడికి మాత్రమే. ప్రపంచ నాటక వ్యవధి మరియు అందులోని వేర్వేరు యుగాలు, ఇంకా మిగిలిన అంతటి గురించి మనము విన్నది, నేర్చుకున్నది మానవ అవగాహన ఆధారితంగానే ఉన్నది. ఈ కారణంగానే రాగి యుగం మరియు ఇనుప యుగంలో పరంధామం  నుండి వచ్చిన దివ్యాత్మలు మరియు ధర్మాత్మలు ఒకటే జ్ఞానాన్ని ఇవ్వలేదు. వాస్తవానికి, రాగి యుగం మరియు ఇనుప యుగంలో ఆత్మ, భగవంతుడు మరియు ప్రపంచ నాటకం యొక్క జ్ఞానం గురించి వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు దివ్యాత్మలందరూ చెప్పినది విభిన్నంగా ఉంటాయి.  ఇనుప యుగం చివరిలో అనగా ఇప్పుడు,  భగవంతుడు తన జ్ఞానాన్ని ఇస్తారు, ఇది రాగి యుగం మరియు ఇనుప యుగంలో ఇవ్వబడిన అన్ని బోధనల యొక్క సత్యం మరియు సారాంశం. ఈ సమయంలో, అశాంతి, దుఃఖం, దుర్గుణాలు మరియు పాపాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచం విపరీతమైన జనాభాతో నిండి ఉంది. జీవించడం కష్టంగా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికీ జీవించడానికి అవసరం అయ్యే ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి మరియు వివిధ భౌతిక వనరులు సమృద్ధిగా లేకపోవడం. అలాగే, గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ప్రమాదాలను ఎదుర్కొంటోంది, ఇతర ప్రకృతి వైపరీత్యాలు మరియు యుద్ధాల ప్రమాదాలు కూడా ఉన్నాయి.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు

30th May – జీవన విలువలు

శాంతి అనుభూతికి 5 దృఢసంకల్పాలు నేను, నా నుదుటి మధ్యలో కూర్చున్న ఆధ్యాత్మిక నక్షత్రం… నేను శాంతి యొక్క సుందర  గుణాన్ని అనుభూతి చేస్తూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ

Read More »
వర్క్-లైఫ్ (work -life)ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం

29th May – జీవన విలువలు

వర్క్-లైఫ్ ని బ్యాలన్స్ గా ఉంచుకోవటం మన వర్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అనే విషయం అంగీకరించే విషయమే. కానీ కొన్నిసార్లు మనము వర్క్  కు   మిగతా వాటికన్నా ఎక్కువ

Read More »
మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్

28th May – జీవన విలువలు

మనసు యొక్క ట్రాఫిక్ కంట్రోల్ ఆలోచనలు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. కాబట్టి మనం ఒక్క తప్పుడు ఆలోచన కూడా చేయకూడదు. సరైన ఆలోచనా సరళితో మనస్సును ప్రోగ్రామ్ చేయడానికి, మనం ప్రతి గంట తర్వాత

Read More »