అందరూ మంచివారనే దృష్టి కోణం (పార్ట్ 1)

అందరూ మంచివారనే దృష్టి కోణం (పార్ట్ 1)

మనమందరం ఉదయం నుండి రాత్రి వరకు ఇతరులతో మాట్లాడుతూ, చర్యలు మరియు ఆలోచనలను చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తాము. ఎంతగా మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలు విభిన్న గుణాల రంగులతో నిండి ఉంటే,  అంతగా మనము సంభాషించే మరియు అనేక మంచి అనుభవాలను పంచుకునే వారందరికీ మన జీవితం ప్రేరణగా ఉంటుంది. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు మార్కెట్‌ను సందర్శించి, తన ఇంటికి కొన్ని వస్తువులను కొనడానికి ఒక దుకాణదారుని కలుసుకున్నప్పుడు, అతనికి చెందని కొంత డబ్బు నేలపై పడి ఉండటం చూశాడు. అతను డబ్బు తీసుకొని దుకాణదారుడి ని దాని గురించి అడిగినప్పుడు, అది దుకాణదారుని డబ్బు అని, అతను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని తప్పుగా చెప్పాడు. అతను డబ్బును తిరిగి ఇవ్వగానే, డబ్బు యొక్క నిజమైన యజమాని దానిని తిరిగి వసూలు చేయడానికి దుకాణంలోకి వచ్చాడు. అమాయక బాలుడు ఆశ్చర్యపోయాడు మరియు దాని గురించి దుకాణదారుని ప్రశ్నించాడు, కానీ అతనికి తప్పుడు సమాధానాలు మాత్రమే వచ్చాయి. ప్రపంచం పూర్తిగా సద్గుణాలతో నిండిన ప్రదేశం కాదని, ప్రజలు అబద్ధాలు మరియు కొన్ని సమయాల్లో మంచివారిగా నటిస్తారని అతని తల్లిదండ్రులు చెప్పినట్లు అతను గ్రహించాడు.

చిన్న పిల్లవాడిలాగా, కొన్నిసార్లు మనం అసంపూర్ణమైన లక్షణాలను కలిగి ఉన్న చాలా మంది తప్పుడు వ్యక్తులతో చుట్టుముట్టబడతాము మరియు కొన్నిసార్లు మనలో కొందరం ఈ ప్రపంచంలో మంచితనం ఉందా లేదా అని నిరుత్సాహపడతాము. భగవంతుడు కూడా పై నుండి ప్రపంచాన్ని చూస్తాడు మరియు ఈ ప్రపంచంలో పెరుగుతున్న లోపాలను చూస్తాడు. మొత్తం మానవాళికి ఒక పేరెంట్‌గా, అతను ప్రపంచాన్ని మార్చాలనే ఈ స్వచ్ఛమైన మరియు మధురమైన కోరికను కలిగి ఉంటారు మరియు ఉన్న నెగిటివ్ అసంపూర్ణత గురించి చింతించరు. అలాగే, ప్రపంచంలో ఉన్న చేదు, అసత్యం, అహంకారం, అసూయ మరియు ద్వేషాన్ని మంచితనం, మధురత మరియు ప్రేమగా మార్చే జ్ఞానం, ప్రేమ మరియు శక్తి భగవంతుడికి ఉంటాయి. ఈ సందేశంలో ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుందాం… 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »