సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 2)

సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 2)

కలిసిన ప్రతి ఒక్కరి నుండి మీరు తీసుకునే దీవెనలు మీ జీవితాన్ని మరింత అందంగా చేయడమే కాకుండా మిమ్మల్ని కష్టాలకు దూరంగా ఉంచుతాయి. ఇతరులకు సంతోషాలను పంచే జీవితాన్ని జీవించడం సులువు – ఒక చిరునవ్వు, ఆప్యాయంగా పలకరించడం, ప్రశంసించడం – ఇటువంటివి చేస్తే అందరినుండి మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి. దీవెనలు ఇవ్వండి దీవెనలు తీసుకోండి అని అంటూ ఉంటారు కదా. అంటే మీరు ఎంతగా ఇతరుల కోసం శుభ భావనలు పెడతారో అంతకంటే ఎక్కువగా అందరి నుండి మీకు శుభ భావనలు తిరిగి వస్తాయి. ఎవరిని కలిసినా ఇటువంటిది ఏదైనా తప్పకుండా ఇవ్వాలి అన్న అలవాటు చాలా మంచిది, ఉదాహరణకు, మీ వద్దకు వచ్చిన వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ కోసం తపిస్తున్నాడే అనుకోండి, అతడిని చూడండి, పవిత్రమైన మరియు పాజిటివ్ ఆలోచన ఆ వ్యక్తి కోసం ఆలోచించండి – ఇతను తన సహజ గుణమైన ప్రేమను అనుభవం చేస్తాడు, ఇతరులకూ పంచుతాడు అని. ఇది ఎంతో వినయంతో చేయండి. ఇది, నేను మారాలి అన్న స్ఫూర్తిని ఆ వ్యక్తికిచ్చి తాను కొరవడుతున్న ప్రేమను ధారణ చేసేలా చేస్తుంది. ఇదెలా పని చేస్తుంది అని మీరనుకోవచ్చు, కానీ మీరు చేసిన పాజిటివ్ ఆలోచనలో ఉన్న శక్తి అపారమైనది, అది ఇతర వ్యక్తిని పూర్తిగా మార్చగలదు. మనలోని ఆలోచనా శక్తి ఆ వ్యక్తిని సూక్ష్మంగా తాకినప్పుడు, అది ఆ వ్యక్తి చెవిలో పవిత్రమైన ప్రేమ సందేశాన్ని మీరు చెప్పినదానితో సమానము, అది అతని మార్పుకు ప్రేరణను ఇస్తుంది. అలాగే మరో ఉదాహరణ, ఎవరికైనా ఎక్కువ కోపం ఉందనుకోండి, మీరు వారిని దారిలో వెళ్తూ చూసినప్పుడు, నీవు నీ సహజమైన శాంతిని అనుభవం చేస్తున్నావు అన్న ఆలోచన చేయండి. ఇటువంటి దీవెనలు అద్భుతంగా పని చేస్తాయి. శక్తిశాలి ఆలోచనలకు ఎంతో శక్తి ఉంది, మాటలకన్నా ఎక్కువ శక్తి ఉంది.

ఈ విధంగా గుప్తంగా మీలో ఉండే ఈ పవిత్ర ప్రేమ ఇతరులకు ఉపశమనాన్ని ఇచ్చే మందుగా అవుతుంది, అది ఇతరులను మానసిక సౌందర్యవంతులుగా చేసి మీకు దగ్గర చేస్తుంది. ఒక వారం రోజులు ఇలా మీరు కలిసిన వారందరికీ శుభ భావనలు ఇచ్చి చూడండి. దీనివలన మీ బంధాలు మరింత అందంగా తయారై, మీ చుట్టుప్రక్కల వారందరూ కూడా మెరుగైన వారిగా అవ్వడాన్ని గమనిస్తారు. ఇది చాలా చక్కని అభ్యాసము.  

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »