Hin

26th feb soul sustenance telugu

భగవంతునితో ఒక అందమైన కొత్త ప్రయాణం ప్రారంభించండి (పార్ట్ 2)

ప్రముఖ వ్యక్తులను, వారు నటులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సాధువులు కావచ్చు, నిరంతరం వారి ప్రత్యేకతల కారణంగా అందరూ గుర్తుంచుకుంటారు. మన దైనందిన జీవితంలో కూడా, మిగిలిన వారి కంటే ఎక్కువ ప్రత్యేకతలు ఉన్న వ్యక్తులను మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాము. భగవంతుడు అత్యంత సంపూర్ణమైన మరియు పరిపూర్ణమైన వ్యక్తిత్వం, కానీ వారి వ్యక్తిత్వం భౌతికం కాదు, ఆధ్యాత్మికం. వారి కంటే ప్రత్యేకత మరియు సద్గుణాలు నిండిన వారు ఎవరూ లేరు. అందుకే విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎక్కువగా గుర్తు చేసుకునే సజీవ శక్తి లేదా వ్యక్తిత్వం వారిది.
పైన పేర్కొన్న వ్యక్తిత్వాలు భౌతిక వ్యక్తిత్వాలు మరియు కొందరు గుర్తుంచుకుంటారు కానీ మిగిలిన వారు గుర్తుంచుకోరు మరియు వారి ప్రత్యేకతలతో పాటు, వారు ఖచ్చితంగా బలహీనతలను కూడా కలిగి ఉంటారు. అలాగే, మీకు, వారిని కొన్ని నిమిషాల పాటు కలవడం కూడా కష్టం అవ్వచ్చు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్క భగవంతుడే ఎటువంటి బలహీనతలు లేని ఒక వ్యక్తిత్వం కలవారు మరియు వారు సదా నా స్నేహితుడు. వారు అత్యున్నత వ్యక్తిత్వం అయినప్పటికీ, ఒకే విధమైన ప్రయాణాన్ని చేస్తున్న లక్షలాది మందికి ఒకే సమయంలో అందుబాటులో ఉండగలరు, వారు సర్వవ్యాపి (అన్నిచోట్లా ఉన్నాడు) అవడం వల్ల కాదు, వారు సర్వశక్తిమంతుడు (అత్యంత శక్తివంతుడు) అవడం వల్ల. మరియు వారు మాత్రమే ఈ సామర్ధ్యం కలిగి ఉన్నారు. కనుక, ఈ ప్రయాణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నేను ఈ ప్రయాణం ఎంత ఎక్కువ పురోగమిస్తున్నానో నాతో పాటుగా ఈ కొత్త వ్యక్తిత్వంతో ఎక్కువ సమయం గడుపుతున్నాను, నా జీవితంలో ఈ కొత్త వ్యక్తిత్వం యొక్క కొత్త లక్షణాలు వెల్లడవుతూ ఉంటాయి.ఈ ప్రయాణంలో మున్ముందు ఏమి కనిపిస్తాయో అని నిరంతరం రిఫ్రెష్ గా ఉంటుంది మరియు ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి, ఈ అన్వేషణ మరియు ఆవిష్కరణల ప్రయాణం ప్రారంభించిన తర్వాత, ఒక్క సెకను కూడా ఆగిపోవడానికి ఎటువంటి కారణం కనిపించదు, పైగా ఇంకా కొనసాగించడానికి మరింత ప్రేరణ కలిగి ఆనందాన్ని ఇస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th october 2024 soul sustenance telugu

అహంకారం లేకుండా నొక్కిచెప్పడం

కుటుంబంలో మరియు కార్యాలయంలో మన వేర్వేరు పాత్రలలో, కావాల్సిన ఫలితాలను పొందేందుకు వ్యక్తులను ప్రభావితం చేయడానికి మనం దృఢంగా ఉండాలి. మన అభిప్రాయాలను మర్యాదగా చెప్పడానికి, ఇతరులను గౌరవించడానికి, ఖచ్చితంగా ఉంటూ మార్పుకు అనువుగా

Read More »
13th october 2024 soul sustenance telugu

భగవంతుని 5 గొప్ప విశేషతలు

అందరూ భగవంతుడిగా ఒప్పుకునేవారు – భారతదేశంలో అనేకులు దేవి దేవతలను పూజిస్తారు. భారతదేశం వెలుపల, వివిధ మత పెద్దలను చాలా గౌరవంతో పూజిస్తారు. కానీ భగవంతుడు నిరాకారుడైన పరమ జ్యోతి. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే

Read More »
12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »