రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 3)

రాజయోగం యొక్క 4 సబ్జెక్టులు మరియు వాటి ప్రాముఖ్యత (పార్ట్ 3)

  1. వివిధ పద్ధతులలో ఇతరుల సేవ – రాజయోగం యొక్క నాల్గవ సబ్జెక్టు ఆలోచనలు, మాటలు మరియు కర్మల  ద్వారా అందరికి సేవ చేయడం. మనం జ్ఞానాన్ని అర్థం చేసుకొని, మెడిటేషన్ నేర్చుకుని మనలో దివ్య గుణాలు, మంచితనం నిండిన తర్వాత, మనం భగవంతుని నుండి తీసుకున్న ప్రతిదాన్నీ మన ఆలోచనలు, వైబ్రేషన్స్,  మాటలు, కర్మల  ద్వారా ఇతరులకు ఇవ్వడం మొదలుపెట్టాలి. అలాగే  ఆధ్యాత్మిక మార్గం అంటే తనను తాను నింపుకుంటూ ఇతరులతో పంచుకోవడం. ఈ రెండూ మనకు ఆధ్యాత్మికతను, దాని ప్రాముఖ్యతను మరింత అర్థం చేసుకోవడంలో, భగవంతుడిని లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మనం భగవంతుని నుండి కేవలం నింపుకొని ఇతరులకు ఇవ్వకపోతే, మన జ్ఞానము మరియు గుణాలు అంతగా పెరగవు. కనుక జ్ఞానం, గుణాలు మరియు శక్తులతో మనల్ని మనం లోతుగా నింపుకున్న తర్వాత ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. మనం నిండుగా లేకుండా ఇచ్చినచో కొంత కాలానికి అది మనల్ని క్షీణింపచేస్తుంది. సేవ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, ఎందుకంటే ఆత్మ జాగృతమై అందరి ఆశీర్వాదాలను పొందుతుంది, మన జీవితాన్ని అడ్డంకులు మరియు కష్టాలు లేకుండా చేస్తుంది.

ఈ సందేశంలో వివరించిన రాజయోగం యొక్క ఈ 4 సబ్జెక్టులు భగవంతునిచే బోధించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రాజయోగం నేర్చుకుని తమ జీవితాలను మార్చుకుంటున్నారు. భారతదేశంలోని అన్ని బ్రహ్మాకుమారీల కేంద్రాలలో రాజయోగం బోధించబడుతోంది మరియు 120 కంటే ఎక్కువ దేశాల్ల, ప్రపంచం నలుమూలల నుండి వారు తమ రోజువారీ జీవితంలో 4 సబ్జెక్టులు ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. బ్రహ్మాకుమారీలతో కనెక్ట్ అయి రాజయోగాన్ని అభ్యసిస్తున్న వారి దినచర్య ఉదయాన్నే ఇంట్లోనే మెడిటేషన్ చేయడం, ఆపై తయారు అయ్యి సమీపంలోని బ్రహ్మాకుమారీల కేంద్రానికి వెళ్ళి జ్ఞానాన్ని వినడంతో  ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని చూసుకోవడం, ఆఫీసుకు వెళ్లడం, నిత్య కర్మలు చేయడం, తమ శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవడం వంటి వారి రోజువారీ విధులను భగవంతుని స్మృతిలో చేస్తారు. స్వచ్ఛమైన జీవనశైలిని, స్వచ్ఛమైన ఆహార-పానీయాలు, త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొవడం ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. రాజయోగి జీవితం యొక్క లక్ష్యం ఆత్మను శుద్ధి చేయడం మరియు ఇతర ఆత్మలు తమను తాము శుద్ధి చేసుకునేలా గైడ్ చేయడం. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »