అహంకారాన్ని త్యాగం చేయటం (భాగం 1)

అహంకారాన్ని త్యాగం చేయటం (భాగం 1)

సంబంధాలు జీవితం యొక్క ప్రాధమిక నిధి, కానీ ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినపుడు అవి తప్పు మార్గంలో వెళ్తాయి. మనుష్యులు ఎప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీకు తెలుసు. అలాగే అహంకార రహితంగా ఉండే వారి సంబంధాలు సమస్య లేనివి మరియు అభిప్రాయ భేదాలు లేనివి. అలాగే, ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో మరియు అవసరమైనప్పుడు తన అహాన్ని త్యాగం చేయడం నేర్చుకుంటే ఆ  సంబంధంలో నిరంతర శాంతి మరియు సద్భావన ఉంటుంది. చాలా సార్లు సంబంధంలో అడ్డంకులు ఏర్పడటానికి ఏకైక కారణం నేను, “నేను మరియు నాది” అనేది  త్యాగం చేయలేకపోవడం. కొన్నిసార్లు చాలా వింతగా అనిపించినప్పటికీ, అహాన్ని త్యాగంచేసి అవతల వ్యక్తి ఆశించినట్లుగా మారకపోవడం వల్ల సంబంధాలలో ప్రేమ తగ్గిపోతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో అభిప్రాయ భేదాలు అన్ని సంబంధాలలో తరచుగా కనిపిస్తాయి, కానీ వాటిని పరిష్కరించుకొని  దాటేయడమే పెద్ద సవాలు. మనమందరం ప్రేమతో నిండిన సంబంధాలను కోరుకుంటాము, అయితే మనం దానికి కావలిసిన త్యాగం చేయగలుగుతున్నామా? అసలు అహంకారాన్ని త్యాగం చేయటం అంటే ఏమిటి? నేను ఓడిపోయాను లేదా నేను ఎల్లప్పుడూ రైట్ కాదు లేదా దయచేసి నా కంటే ముందు వెళ్లండి లేదా మీరు బాధ్యత వహించండి లేదా మీరు నా కంటే గొప్పవారు అని అంగీకరించడం.

కొన్నిసార్లు కుటుంబంలో లేదా ఆఫీసులో అనేక రకాల సంబంధాలలో మొదట అంతా బాగానే ఉండి ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు దగ్గరవుతారు. కానీ సమయం గడిచేకొద్దీ, అపార్థాలు కలుగుతాయి. సంబంధం చుక్కాని లేని పడవలా మారి దాని దిశను కోల్పోతుంది. ఇది ప్రారంభంలో జరగక ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ప్రారంభంలో హృదయాలు దగ్గరగా ఉంటాయి మరియు త్యాగం చేయడం మరియు సంబంధంలో తక్కువ ఆధిపత్య వ్యక్తిగా మారడం వంటి ప్రతిదీ సులభం. కానీ నెమ్మదిగా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు దానితో అందమైన సంబంధంలా అనిపించినది, బాధాకరమైన ముళ్ళుగా మారి వ్యక్తిత్వ ఘర్షణలతో నిండి ఉంటుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »