బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీస్ యొక్క 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఇది ఎక్కువగా వ్యక్తిగతంగా లేదా చిన్న గ్రూపులుగా కేంద్రాలలో (సెంటర్ లలో) నిర్వహించబడుతుంది. దీని వ్యవధి 7 రోజుల పాటు ప్రతిరోజూ ఒక గంట మీరు సెంటర్ కి వెళ్లి అయినా లేదా కాల్ చేసి సెంటర్ ఇంఛార్జ్‌తో మాట్లాడటం ద్వారా కోర్సు చేసే సమయాన్ని నిర్ణయించవచ్చు. కొన్ని ప్రదేశాలలో, భారతదేశంలోని రాజస్థాన్ మౌంట్‌లోని ఆరావళి కొండలలో ఉన్న బ్రహ్మా కుమారీల ప్రధాన కార్యాలయం, భారతదేశంలో మరియు విదేశాలలో కొన్ని నగరాల్లోని రిట్రీట్ సెంటర్లలో వలె, ఇది పెద్ద గ్రూపులలో కూడా నిర్వహించబడుతుంది. 2-4 రోజులు, మా ఆధ్యాత్మిక సోదరీలు మరియు సోదరులు ఆ క్యాంపస్‌లకు కోర్సు చేయటానికి వెళ్ళినప్పుడు 2-4 రోజులు పూర్తిగా  అక్కడే ఉంటారు. వారు మౌంట్ అబూలో లేదా మా రిట్రీట్ సెంటర్లలో కోర్సును అభ్యసించినప్పుడు, ఒక్కోసారి ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ సెషన్ లు  ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో ఉన్న ఇతర సెంటర్ లలో, ఇది సాధారణంగా 7 రోజుల పాటు ప్రతిరోజూ ఒక సెషన్ ఉంటుంది.

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు సాధారణంగా ఉండే 7 సెషన్‌లు –

 

  1. ఆత్మను (స్వయాన్ని) అర్థం చేసుకోవడం
  2. భగవంతుడు లేదా పరమాత్మను అర్థం చేసుకోవడం
  3. ఈ ప్రపంచ నాటకంలో భగవంతుని కర్తవ్యం ఏమిటి మరియు వారు  ప్రస్తుత సమయంలో ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నారు మరియు కొత్త ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తున్నారు?
  4. ప్రపంచ నాటకం లేదా 5000 సంవత్సరాల ప్రపంచ చక్రం అంటే ఏమిటి మరియు అది ఎలా పునరావృతమవుతుంది?
  5. ప్రపంచ నాటకం మెట్ల ద్వారా వివరించబడింది, దీనిలో ప్రతి మెట్టు మనం తీసుకునే 1 జన్మను సూచిస్తుంది
  6. కల్ప వృక్షాన్ని, దానికి బీజమైన భగవంతుడిని అర్థం చేసుకోవటం 
  7. రాజయోగ మెడిటేషన్ లో  పరమాత్మ లేదా భగవంతునితో కనెక్ట్ అవ్వడం మరియు దాని టెక్నిక్ ను  నేర్చుకోవడం

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »