అందరూ మంచివారనే దృష్టి కోణం (పార్ట్ 2)

అందరూ మంచివారనే దృష్టి కోణం (పార్ట్ 2)

భగవంతుడు ప్రపంచాన్ని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే వారు ప్రేమ సాగరుడు మరియు దయా సాగరుడు. మనం ప్రపంచంలోని లోపాలను చూసినప్పుడు, కొన్నిసార్లు మనకు దుఃఖం, ద్వేషం మరియు కోపం కూడా వస్తుంది. ప్రపంచంలోని కోట్లాది మంది పిల్లల మనస్సులోని నెగెటివిటీ భగవంతునికి తెలిసినప్పటికీ, వారిలో దాగి ఉన్న మంచితనం కూడా వారికి తెలుసు, అది మనము చూడలేము. మంచితనం అంటే కేవలం ఇప్పుడు ఉన్నది మాత్రమే కాదు గత జన్మల్లొ కలిగి ఉన్నది కూడా. కాబట్టి, భగవంతుడు ప్రపంచంలో కోపం, అహం, అసూయ, పగ, ద్వేషం చూసినప్పుడు కోపం తెచ్చుకోరు, ఎవరినీ ద్వేషించరు లేదా బాధ పడరు. 

కాబట్టి, లోకం పట్ల  మన అవగాహన గురించి ఆలోచించి , భగవంతుని అవగాహన నుండి పాజిటివ్ స్ఫూర్తిని పొందుదాం. ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ మన ఆవినాశి కుటుంబం కనుక ప్రపంచంలో మరియు అందరిలో మంచినే చూస్తూ మంచి మాత్రమే చేస్తాను అని మనకు మనం చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో మంచి క్షీణిస్తుంది మరియు మంచిగా ఉండేందుకు మనకు ఎటువంటి సపోర్ట్ లేదని మనము చింతించము. ఈ లోకంలో కొందరు మంచిగా ఉంటే మనుగడ సాగించలేము అని, వారు జీవితంలోని అన్ని రంగాలలో వెనుకబడిపోతారు అని తమ మంచిని విడిచిపెడతారు. మరి కొందరు తమ చుట్టూ ఏం జరిగినా మంచిగానే ఉంటారు. అలాంటి వారిని లోకం మాత్రమే కాదు, భగవంతుడు కూడా ఎంతో ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు. కొన్నిసార్లు ప్రపంచం నుండి ఈ ప్రేమ రావడానికి సమయం పడుతుంది, కానీ మీరు భగవంతుని ప్రేమను ఎంజాయ్ చేస్తూ, వారి దృష్టిలో మీరు  మంచి వ్యక్తులుగా ఉంటే  మనుష్యులు మిమ్మల్ని ఇప్పుడు కాకపోతే తరువాత అయినా ప్రేమిస్తారని గుర్తుంచుకోండి. కాబట్టి ఎల్లప్పుడూ మంచిగా ఉండి, ఎల్లప్పుడూ మంచినే  చేయండి, మంచితనం నిండిన వ్యక్తిత్వం, సర్వులకు  ప్రియంగా ఉంటుంది మరియు భగవంతునిచే గౌరవించబడిన వ్యక్తిగా ఉంటారు.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »