Hin

సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 3)

సానుకూల ఆలోచన ఆధారిత జీవనం (పార్ట్ 3)

మనసుతో శుభ భావనలను ప్రసరింపజేయడానికి సులభమైన ఉపాయము ఇతరులను ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక జీవిగా చూడటం, అంటే, ఇతురల ఆత్మిక రూపాన్ని చూడటం. ఆత్మ ఒక ఆధ్యాత్మిక శక్తి, అది ఈ సృష్టికి నిత్యం శక్తినిస్తూనే ఉంటుంది. నా వలె, ఇతరుల నుదుటి మధ్యలో ఉన్న ఈ నక్షత్ర సమాన ఆత్మను చూసినప్పుడు, నేను నాలోని సహజ గుణాలైన పవిత్రత, శాంతి, ప్రేమ మరియు ఆనందాలను ప్రసరింపజేస్తాను. ఇది ఇతరులను నా దృష్టితో బలపరచడంతో సమానము. దీనినికూడా ఎంతో అణకువతో, తోటివారిని సోదరాత్మగా, పరమాత్ముని సంతానంగా భావించి చేయాలి. ఆ పరమాత్మునితో మనందరికీ సమానమైన బంధం ఉంది. అలాగే, మనమంతా ఆ భగవంతుని బిడ్డలం కనుక, మనందరిలోనూ పైన చెప్పబడిన సహజ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ మీరు ఎంతోమందిని కలుస్తూ ఉంటారు. వారిని వారి నుదుటి మధ్యన ఉన్న ఆత్మ రూపంలో చూడండి. మీ దృష్టితో పంచినదానిని వారు మీకు తిరిగి ఇస్తారు. భగవంతుడు మనందరినీ ఈ ఆత్మిక దృష్టితోటే చూస్తారు. భగవంతుడికి మీ భౌతిక కాయం, మీరు పోషించే పాత్ర గురించి తెలుసు, అయినా కానీ మిమ్మల్ని నక్షత్ర సమానంగా ఆత్మ రూపంలోనే చూస్తారు. ఆత్మ ధరించిన ఈ భౌతిక వస్త్రాన్ని మనం భౌతిక శరీరం అంటాము, ఈ శరీరంతో మనం  పోషించే పాత్ర తాత్కాలికమైనది, మారుతూ ఉంటుంది.  

చివరగా, ఎప్పుడూ ఎవరి గురించీ చెడుగా ఆలోచించకండి. ఎంత బిజీగా ఉంటామో, ఒక్కోసారి అంత చెడుగా ఇతరుల పట్ల వ్యవహరిస్తుంటాము ఎందుకంటే ఆత్మ పరిశీలనకు మనం సమయం కేటాయించడం లేదు కాబట్టి. తరచుగా, ఇతరుల గురించి మన సన్నిహితులతో లేక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రతికూల వైఖరిని మనం అలవర్చుకుంటాం. ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి కాదు, అతని స్వభావం ఇది, అతని బలహీనత ఇది, అతడిలా చెడుగా ప్రవర్తించాడు అని చెప్తుంటాము. ఇది చాలా సాధారణమైపోయింది. మీరు ఇంటికి రాగానే ఆ రోజు ఆఫీసులో జరిగిన అన్ని నెగిటివ్ విషయాలను ఇంట్లో ప్రస్తావిస్తారు. భౌతికంగా ఆ వ్యక్తికి దూరంగా ఉండి అతని గురించి మీరు చెడుగా మాట్లాడినాగానీ ఇదంతా అభౌతిక స్థాయిలో వారి వద్దకు చేరుకుని మీ బంధానికి అవరోధంగా అవుతుంది. కనుక, పాజిటివ్‌గా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి, పాజిటివ్ శక్తిని సర్వదా, సర్వులకు పంచండి. ఇదే సానుకూల ఆలోచన ఆధారిత జీవనం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »