27th feb soul sustenance telugu

విజయానికి 8 శక్తులు (భాగం 1)

జీవితంలో ఒక ముఖ్యమైన కొలిచే మీటర్ మన దినచర్యలో ఉపయోగించడం మరచిపోతూ ఉంటాము. అదే ఆధ్యాత్మిక శక్తి మీటర్. జీవితంలో ఎలాంటి కఠిన పరిస్థితిని అధిగమించడంలో ఆధ్యాత్మిక శక్తిని ఎంత బాగా ఉపయోగిస్తున్నాను అనేదే ఈ మీటర్ అర్థం. ఎనిమిది ప్రధాన ఆధ్యాత్మిక శక్తులు – సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, ఎదుర్కొనే శక్తి, సర్దుకునే శక్తి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి మరియు సహయోగ శక్తి.
ఉదా. నేను రద్దీగా ఉండే రహదారిపై నా కారును నడుపుతున్నాను, సడన్ గా నా కారును వెనుక నుండి మరొక డ్రైవర్ ఢీకొట్టడంతో నా కారుకు పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద నగరాల్లో మనం చూస్తున్నట్లుగా, అలాంటి పరిస్థితుల్లో చాలా మంది వ్యక్తులు, కారు నుండి బయటికి వచ్చి, ఎదురుగా ఉన్న కారు డ్రైవర్ని నిలదీస్తారు . వారు అతని నుండి కొన్ని వేల రూపాయలు డిమాండ్ చేస్తారు. కొన్నిసార్లు, మాటల యుద్ధం మరియు కొట్లాట కూడా జరగవచ్చు, కొన్నిసార్లు కోపం ఎక్కువై మితిమీరి గాయం లేదా మరణానికి దారితీస్తుంది. మరోవైపు,ఇదే పరిస్థితిలో ఉన్న మరొక వ్యక్తి, ప్రశాంతంగా ఉండి కోపం తెచ్చుకోకుండా, అవతలి డ్రైవర్‌ను క్షమించి, కొట్లాడకుండా, నిశ్శబ్దంగా తిరిగి వెళ్ళిపోతాడు. రియాక్షన్ భిన్నంగా ఉండడానికి మొదటి వ్యక్తికి ఏ శక్తి లేదు మరియు రెండవ వ్యక్తికి ఏ శక్తి ఉంది? ఈ పరిస్థితిలో, పైన పేర్కొన్న ఎనిమిది శక్తులలో, సహన శక్తి మరియు అవతలి వ్యక్తి యొక్క చర్యలను ఇముడ్చుకునే శక్తి, ఈ రెండు ప్రధాన శక్తులు అవసరం . వాస్తవానికి, ఇతర ఆరు శక్తులు కూడా అవసరమే కానీ పేర్కొన్న రెండు మిగిలిన వాటి కంటే ఎక్కువ అవసరం. ఇది ఒక సాధారణ సంఘటనకు ఉదాహరణ, ఇక్కడ కోపం మరియు అహం రెండు ప్రధాన నెగెటివ్ శక్తులు. ఈ నెగెటివ్ శక్తులపై విజయం సాధించడానికి రెండు ఆత్మిక శక్తులు – సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి కావాలి. అలాగే, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాటిలో నాలుగూ ఆత్మ యొక్క సంస్కారాలే – రెండు ఆత్మిక శక్తులు, అలాగే రెండు నెగెటివ్ ఫోర్సులు. ఆ నాలుగు పరివర్తన అయ్యే సంస్కారాలే. అంటే శక్తిని నింపవచ్చు లేదా పెంచవచ్చు మరియు నెగెటివ్ శక్తిని తొలగించవచ్చు లేదా తగ్గించవచ్చు అని అర్థం .
(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »
26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »