27th jan 2023 sst

విజయం మరియు దాని సరైన సారాంశం (భాగం - 1)

మనమందరం అనేక లక్ష్యాలు మరియు విజయాల సాధించాలానే ఆకాంక్షతో మన జీవితాలను గడుపుతాము. జీవితం మనకు వివిధ రకాల పరిస్థితులను అందిస్తుంది మరియు జీవితంలో ప్రతి క్షణంలో ఏదో ఒకటి సాధించవలసి ఉంటుంది. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా మరియు సంతృప్తిగా గడపడంలోనే నిజమైన విజయం ఉంది . మరోవైపు, వివిధ రంగాలలో ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోవడం మరియు జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించడం కూడా చాలా ముఖ్యం. ఇంకా, ఈ లక్ష్యాలు మరియు మైలురాళ్లను చేరుకునేటప్పుడు మరియు వాటిని చేరుకునే దిశగా మన ప్రయాణంలో, మనం తేలికగా ఉండి, మన కర్మలను పాజిటివ్ గా మరియు సరైనవిగా ఉంచుకుంటూ మనం సంతోషంగా ఉంటే, అదే నిజమైన విజయం.

మనం ప్రయత్నించి మన లక్ష్యాలను చాలా వేగంగా సాధించినప్పుడు, కొంత విజయం సాధించవచ్చు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో మీరు ఇతరులకు దుఃఖాన్ని కలిగించే కర్మలను చేస్తే లేదా మీరు నిజాయితీగా లేకుంటే లేదా మీరు ఆశ మరియు విశ్వాసాన్ని కోల్పోయినా లేదా దాని కారణంగా మీ సంబంధాలు లేదా ఆరోగ్యంపై ప్రభావం చూపితే, అది నిజమైన విజయం కాదు. విజయం అంటే చివరి గమ్యాన్ని చేరుకున్నప్పుడు మాత్రమే కాకుండా అడుగడుగునా విజయం సాధించిన అనుభూతిని పొందడం. అలాగే, విజయం అంటే ఒకరికొకరు శుభ భావనలను మరియు ప్రేమను, ఆశీర్వాదాలు ఇచ్చి పుచ్చుకోవడం , మంచి గుణాలు మరియు శక్తులతో ప్రతి ఒక్కరికి సేవ చేయడం మరియు మంచి వ్యక్తిగా ఉండటం. సంపద లేదా భాద్యత అనే భౌతిక విజయం ఉన్నప్పటికీ విభిన్న భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక పరంగా విజయాన్ని అనుభవించకపోవడం పూర్తి విజయం కాదు మరియు 100% విజయం కాదు

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »