Hin

పిల్లలను భగవంతునితో కనెక్ట్ చేయడానికి 5 విధానాలు

పిల్లలను భగవంతునితో కనెక్ట్ చేయడానికి 5 విధానాలు

  1. పిల్లలకు ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని ఇవ్వండి – పిల్లలు ఆకట్టుకునే మనస్సును కలిగి ఉంటారు. వారికి ఏది నేర్పించినా సులభంగా గ్రహిస్తారు. కాబట్టి వారికి చిన్నప్పటి నుండే, ఆత్మ మరియు పరమాత్మ గురించి మరియు వారి రూపం, గుణాలు, ఇల్లు మరియు ప్రపంచ నాటకంలో వారు ఏమి చేస్తారో నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారిని ఆధ్యాత్మికంగా వివేకవంతులుగా మారుస్తుంది.
  2. పిల్లలకు వారి జీవితంలో భగవంతునికి సమయం కేటాయించడం నేర్పించండి – నేటి ప్రపంచంలో, పిల్లలు నెగెటివ్ గా ప్రభావితం అవ్వడం చాలా సులభం, వారు భగవంతునికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం లేదా వారు  కేవలం కల్పన మాత్రమే అని భావించడం సర్వసాధారణం. కాబట్టి వారికి ఉదయం మరియు నిద్రపోయే ముందు భగవంతుడిని స్మరించుకునేలా శిక్షణ ఇచ్చి ప్రతి పనిలో భగవంతుడిని తమకు తోడుగా ఉంచుకోవడం నేర్పించాలి.
  3. పిల్లలకు భగవంతుని చేయి పట్టుకోవడం ద్వారా జీవితంలో కలిగే విజయానికి మార్గాన్ని చూపండి – పిల్లలకు  చదువులు, పరీక్షలు, వ్యక్తిత్వం, ఆరోగ్యం, క్రీడలు సంబంధించిన అనేక లక్ష్యాలు ఉంటాయి.  భగవంతుని చేయి పట్టుకోవడం ద్వారా ఈ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి పిల్లలు మెడిటేషన్  నేర్చుకునేలా ప్రేరేపించబడాలి. జీవితంలోని ప్రతి రంగంలో విజయం కోసం వారి ఆంతరిక శక్తులను ఉపయోగించేలా ప్రేరేపించాలి.
  4. ఇంట్లో పరివారం అంతా కలిసి పాజిటివ్ మనస్థితిని తయారు చేయండి – ఒక మంచి ఆధ్యాత్మిక సాధన అంటే ప్రతి ఉదయం కనీసం 15 నిమిషాల పాటు కుటుంబ సభ్యులందరూ సామూహికంగా చదవడం లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం. రోజంతా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తుంచుకొని దానిని అనుసరించాలని పిల్లలకు నేర్పించాలి.
  5. పిల్లలకు డైరీని పెట్టుకొని వారి బలహీనతలను దానం చేయడం నేర్పండి – తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి జీవితం గురించి భగవంతుడికి చెప్పడం, వారి ప్రత్యేకతలు మరియు బలహీనతల గురించి డైరీలో వ్రాయడం  నేర్పించాలి. అలాగే, వారికి ఎలాంటి బలహీనతలు ఉన్నా భగవంతుడికి దానం చేసి, కొత్త గుణాలను పెంచుకునేలా శిక్షణ ఇవ్వాలి. ఇది వారిని మానసికంగా వివేకవంతులుగా చేసి భగవంతుడికి దగ్గర చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »