27th jun - జీవన విలువలు

అహంకారాన్ని త్యాగం చేయటం (భాగం 2)

మీకు మరొక వ్యక్తితో పరిచయం ఏర్పడినప్పుడల్లా, మీరు మీలా ఉండేలా చూసుకోండి, అయితే అదే సమయంలో మీరు అతనిని లేదా ఆమెను తమలా ఉండనివ్వడం ద్వారా అవతలి వ్యక్తికి ఒక విలువను ఇస్తారు. అంటే అవతలి వ్యక్తికి వారు కోరుకునే విధంగా వ్యక్తీకరించడానికి లేదా ప్రవర్తించడానికి అవకాశం ఇవ్వడం. వారు మీ చేతుల్లో కీలుబొమ్మ కాకూడదు. వారికి చెప్పాల్సినవి చెప్పండి, మార్గాన్ని నిర్దేశించండి, కానీ మీ అభిప్రాయం, మీ దృక్కోణం, లేదా మీరు ఖచ్చితంగా సరైనది మరియు పరిపూర్ణమైనదిగా భావించే సంస్కారం పట్ల మీకున్న మొహాన్ని త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ ఇద్దరికి సంబంధించిన పరిస్థితిలో అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని అనుమతించడానికి సిద్ధంగా ఉండండి. కొందరు సంబంధాలలో దీన్ని పాటించడం చాలా కష్టమైన విషయంగా భావిస్తారు. అయితే దీనికి ఆధ్యాత్మిక శక్తి మరియు అవతలి వ్యక్తి పట్ల మీలో చాలా ప్రేమ కూడా అవసరం. అలాగే, మనకు వినయం మరియు సంతృప్తి వంటి గుణాలు చాలా ముఖ్యమైనవి. ఇంట్లో లేదా మీ స్నేహితుల సర్కిల్‌లో లేదా మరెక్కడైనా; మీ పిల్లలతో లేదా మీ యజమానితో, స్నేహితుడితో లేదా మీ జీవిత భాగస్వామి – ఇలా ఏ సంబంధంలోనైనా ఇది అవసరం.

ఒక పరిస్థితి గురించి మీరు అనుకున్నదే సరైనది అనే అధిక ఆత్మ గౌరవముతో ఉన్నదానికి, ఆ పరిస్థితి గురించి మీకు తెలిసినదానికి మరియు అవతలి వ్యక్తి కూడా అదే ఆలోచనా ప్రక్రియ లో సహకరించేలా చేయడంలో కొద్దిగా తేడా ఉంటుంది.   దాని అర్థం ఏమిటంటే, అవతలి వ్యక్తి మీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునేందుకు కొంత సమయాన్ని ఇవ్వాలి. చాలా సార్లు మనం మన ఆలోచనా విధానం చుట్టూ అవతలి వ్యక్తి మనపై ఆధిపత్యం చెలాయిస్తాడనే భయంతో  మరియు మన స్వంత అభిప్రాయాల పై మోహం  కారణంగా అవతలి వ్యక్తిని దానిలోకి ప్రవేశించనివ్వకుండా గిరి గీసుకుంటాము. ఇతరుల అభిప్రాయాలను అంగీకరించి, ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించి వాటిని తమ అభిప్రాయాల వలె గౌరవం ఇచ్చేవారిని అందరూ ఇష్టపడతారు అని గుర్తుంచుకోండి. మనుష్యులను ప్రేమ మరియు గౌరవంతోనే గెలుచుకోగలము, అధికారంతో కాదు. మన ఆలోచనలలో, భావోద్వేగాలలో మరియు  అది భౌతిక స్థాయిలో కూడా పరస్పర చర్యలలో ఇతరులను మన కంటే ముందు ఉంచడం ద్వారానే అది  జరుగుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »