Hin

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలలో కొత్తగా చేరినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం మెడిటేషన్  ఎందుకు నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సులోని అన్ని వేర్వేరు సెషన్‌లకు ఎందుకు హాజరు కావాలి? ఎందుకంటే, కొంతమంది ప్రధానంగా మెడిటేషన్ ద్వారా మనశ్శాంతి మరియు ఆనందం కోసం వెతుకుతున్నారు.  మెడిటేషన్ ద్వారా ఒత్తిడి నుండి విముక్తిని పొంది జీవితంలోని రోజువారీ సమస్యలను ఎదుర్కోవడానికి వారి ఆంతరిక శక్తిని పెంచుకోవాలని కోరుకుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం. ఆత్మ, భగవంతుడు లేదా పరమాత్మ మరియు ప్రపంచ నాటకం యొక్క పూర్తి జ్ఞానాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే, మనం మెడిటేషన్ లో భగవంతునితో కనెక్ట్ కాలేము మరియు మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను, ఎలా మనలో శాంతి మరియు ఆనందాన్ని నింపకోవాలో లోతుగా గ్రహించలేము. మెడిటేషన్ ద్వాపర యుగం నుండి అనేక జన్మలలో ఆత్మలో పేరుకుపోయిన మన నెగెటివ్ సంస్కారాలన్నింటినీ శుభ్రపరుస్తుంది అని తెలుసుకోలేము. అలాగే, ఉన్నతమైన మెడిటేషన్ కోసం కావలిసిన  పరమాత్ముడితో మనకున్న ఆధ్యాత్మిక సంబంధాన్ని సరిగ్గా మరియు లోతుగా మనం అనుభూతి చెందలేము.  

ఈ 7 రోజుల కోర్సుకు ఎటువంటి ఛార్జీలు లేవు.  మీరు వెచ్చించాల్సింది కేవలం 7 గంటల సమయం మాత్రమే మరియు ఈ 7 గంటలు మీ మొత్తం జీవితాన్ని మార్చివేస్తాయి. మానసికంగా, ఎమోషనల్ గా మరియు శారీరకంగా అన్ని విధాలుగా మీ జీవితం యొక్క క్వాలిటిని  పెంచుతాయి.  ఎందుకంటే మీరు ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు కర్మ నియమాలకు సంబంధించిన మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. స్వచ్ఛమైన మరియు పాజిటివ్ జీవనశైలిని ఎలా పొందాలో మీరు నేర్చుకుంటారు. మీరు భగవంతుని దగ్గరికి వచ్చి వారిని పూర్తిగా తెలుసుకొని  మెడిటేషన్ లో వారిని స్మరించుకోవడం ప్రారంభిస్తారు. కోర్సులో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా, వారి సమీప బ్రహ్మ కుమారీస్ కేంద్రాన్ని సంప్రదించవచ్చు, ఇది పరమాత్ముని ఆధ్యాత్మిక గృహం లాంటిది, ఇక్కడ పరమాత్ముడు లేదా మీ ఆధ్యాత్మిక తల్లి లేక తండ్రి మీకు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క తాళం చెవిని అందిస్తారు.  ఇది మీ భాగ్యాన్ని శాశ్వతంగా మారుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 4)

మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సమతుల్య మనస్సును ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. కోపం, ఆవేశం, అహం లేదా దురాశ మన ఆలోచనలలో అసమతుల్యతను సృష్టించవచ్చు. మనల్ని మనం మనలాగే అనుభవం చేసుకున్నప్పుడు మరియు

Read More »
19th june2024 soul sustenance telugu

  పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

భవిష్యత్తు మాత్రమే అత్యంత ముఖ్యమైనది అనే ఆలోచన నుండి కూడా మనం విముక్తి పొందాలి. సామాజికంగా చెల్లుబాటు అయ్యే లక్ష్యాలను సాధించే ఈ ట్రెడ్‌మిల్‌లో, విజయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము,  కనీసం దానిని సాధించినందుకు

Read More »
18th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

సంతోషం మరియు విజయం వాస్తవానికి పరస్పరం ముడిపడి ఉంటాయి. ఆ రెండు ఒక సాధారణ అంశాన్ని పంచుకుంటాయి – వాటిని అనుసరించలేము. మనం ఆత్మిక స్థితిని అభ్యసిస్తే, విజయం మరియు సంతోషం  రెండింటినీ సాధించిన

Read More »