అందరూ మంచివారనే అనే దృష్టికోణం (పార్ట్ 3)

అందరూ మంచివారనే అనే దృష్టికోణం (పార్ట్ 3)

ప్రతిరోజూ, మీరు పనులు ప్రారంభించినప్పుడు, ప్రతి ఒక్కరినీ మీ దృష్టి మరియు హృదయంలో మంచితనంతో చూడండి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ భగవంతుడు ఎలా చూస్తున్నాడో మీకు మీరు చెప్పుకొని విజువలైజ్ చేసుకోండి. మీ ఎదుట ఉన్న నెగిటివ్ స్వభావం కలిగి ఉన్న, మీతో అప్పుడప్పుడు సరిగా  ప్రవర్తించని వ్యక్తి పట్ల భగవంతుని ప్రేమ మరియు శుభ ఆశీస్సులను ఉంచండి. మీకు వారితో హాయిగా మరియు శాంతియుతంగా సంభాషించడం కష్టం అనిపించవచ్చు. ఇప్పుడు ఈ పాజిటివ్  జ్ఞానాన్ని మీ మనస్సులో ఉంచుకొని, ఆ వ్యక్తి పట్ల పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరచుకోండి. ఇప్పుడు ఆ పాజిటివ్ దృక్పథాన్ని ఆధారంగా, అవతలి వ్యక్తి పట్ల పాజిటివ్ దృష్టిని కలిగి ఉండండి.  మీ దృష్టి ఎంత పాజిటివ్ గా ఉంటే, మీ మాటలు మరియు కర్మలు  వారి పట్ల మరింత మంచిగా మరియు పాజిటివ్ ఉంటాయి. మీ మాటలు మరియు కర్మలు ఎంత స్వచ్ఛంగా మరియు చక్కగా ఉంటే, ఆ వ్యక్తి మీకు కావలసిన విధంగా మంచి వ్యక్తిగా మారుతారు. ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్చడానికి ఇదే రహస్యం. మన చేతనం మన వైఖరిని ప్రభావితం చేస్తుంది; మన వైఖరి మన దృష్టిని; మన దృష్టి మన మాటలు మరియు కర్మలను ప్రభావితం చేస్తుంది. అవన్నీ కలిసి మంచితనం యొక్క పాజిటివ్ శక్తిని వారికి రేడియేట్ చేస్తాయి. ఈ పాజిటివ్ శక్తి అవతలి వ్యక్తి స్వభావాన్ని పాజిటివ్ గా మారుస్తుంది. ఈ ప్రక్రియను స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన లేదా నా పరివర్తన ద్వారా ఇతరుల పరివర్తన అని అంటారు.

మనం కొన్నిసార్లు మనం ఇంట్లో లేదా మన కార్యాలయంలో లేదా మన సమాజంలో మనుష్యులలో నెగెటివిటీని  చూసే ప్రపంచంలో జీవిస్తున్నాము. అలాగే, కొన్నిసార్లు మనం వ్యక్తులు చెడ్డవారు కానప్పటికీ చెడ్డవారని అనుకుంటాము. కానీ మీరు మీ మంచితనాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకుండా జాగ్రత్త వహించండి. భగవంతుడు మొత్తం ప్రపంచంలో చాలా నెగెటివిటీ చూస్తారు, కానీ వారు అందరూ మంచివారనే దృష్టి కోణాన్ని విడిచిపెట్టరు. వారు  తన వద్ద ఉన్న ఆత్మిక జ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛంగా మరియు పాజిటివ్ గా ఉన్నారని, అనేక జన్మలలో తమ మంచితనాన్ని కోల్పోయారనే జ్ఞానం వారి దృష్టిని పాజిటివ్ గా ఉంచడానికి మరియు ప్రతి ఒక్కరికీ మార్పు కోసం శుభాశీస్సులు ఇచ్చేందుకు దోహద పడుతుంది. కాబట్టి మంచిగా ఉంటూ  మంచిని చూడండి మరియు ఆ మంచి దృష్టితో ఇతరులను మంచి వారిగా మార్చండి. ఈ ప్రపంచంలో అసంపూర్ణత అనే సాగరం మిమ్మల్ని చుట్టుముట్టినా  కూడా మీ మంచితనాన్ని వదిలివేయవద్దు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో ఆధ్యాత్మిక జ్ఞానం అనే మొదటి అద్దం గురించి చర్చించుకున్నాం. ఈ అద్దం మీకు పరమాత్మను కూడా చూపుతుంది, వారి సద్గుణాలను , పదాలు మరియు చర్యలను గురించి మీకు గుర్తు చేస్తుంది.

Read More »
25th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 1)

మన బాహ్య రూపాన్ని లేదా పరిశుభ్రతను చెక్ చేయడానికి, మనం ప్రతిరోజూ అద్దంలోకి చూస్తాము. కానీ మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో, మీ అంతర్గత ముఖం లేదా ఆధ్యాత్మిక స్వయంలో ఏదైనా తప్పు

Read More »
24th-sept-2023-soul-sustenance-telugu

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి

Read More »