దివ్యంగా, అందంగా రక్షా బంధన్ జరుపుకోవడం (పార్ట్ 1)

దివ్యంగా, అందంగా రక్షా బంధన్ జరుపుకోవడం (పార్ట్ 1)

రక్షా బంధన్ (ఆగస్టు 30) అనేది సోదరీసోదరుల మధ్య జరుపుకునే పండుగ, ఇది స్వచ్ఛత మరియు రక్షణను సూచించే  బంధం.

ఇంతకు ముందు అనుసరించిన ఆచారాలు నేటికి భిన్నంగా ఉన్నాయి. పూర్వం ప్రతి కుటుంబానికి ఒక పూజారి ఉండేవాడు, ప్రార్థనలు మరియు వైబ్రేషన్ల శుద్ధి కోసం ఇంటికి వారిని ఆహ్వానించేవారు. పూజారి ప్రతి ఒక్కరి మణికట్టుకు పవిత్రమైన దారం కట్టేవాడు.

ఈ పవిత్ర దారం ప్రతిజ్ఞ యొక్క దారం. కుటుంబ సభ్యులందరూ సరైన చర్యలతో జీవితాన్ని గడపుతామని వాగ్దానం చేసేవారు. క్రమంగా ఆచారం మారడం ప్రారంభమైంది – కుటుంబంలోని యువతులు పవిత్రమైన దారాన్ని కట్టారు, తర్వాత అది సోదరీమణులు తమ సోదరులకు దారం కట్టడంగా మారింది.

ఒకవేళ సోదరుడు చిన్న పిల్లవాడు అయితే తన చెల్లిని కాపాడుకోగలడా? ఒక సోదరుడు తన సోదరి రక్షణ కోసం ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండగలడా? సోదరులకు కాక సోదరికి మాత్రమే రక్షణ కావాలా? పండుగ కేవలం భౌతిక రక్షణను మాత్రమే నేర్పుతుందా లేదా లోతైన అభ్యాసం ఉందా?

మనం చేసే ప్రతి పండుగ, ఆచారం ఒక అర్థాన్ని తెలియజేస్తాయి. ఆచారం అనేది సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మనం అనుసరించాల్సిన దానికి ప్రతీకాత్మక ప్రాతినిధ్యం.

రక్షా బంధన్ అనేది రాఖీ కట్టడం మరియు సోదరిని రక్షించడం కంటే ఎక్కువ. ఈ పండుగ స్వచ్ఛత మరియు రక్షణ మధ్యనున్న ప్రత్యక్ష సంబంధాన్ని గుర్తు చేస్తుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

21th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 3)

శ్రీ గణేష్ యొక్క పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. ఇతరుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేష్ చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం

Read More »
20th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 2)

నిన్న మనం  శ్రీ గణేష్ జన్మ యొక్క నిజమైన అర్ధాన్ని తెలుసుకున్నాము. శంకరుడు బిడ్డ తలను నరికి, అతని శరీరంపై ఏనుగు తలను ఉంచారు, ఇది పరమపిత తండ్రి మన అహంకారమనే తలను అంతం

Read More »
19th-sept-2023-soul-sustenance-telugu

గణేష్ చతుర్థి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత (పార్ట్ 1)

మనం శ్రీ గణేషుని యొక్క ఆగమనం మరియు జననాన్ని గొప్ప విశ్వాసంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటాము. మన జీవితంలోని విఘ్నాలను తొలగించమని వారిని  ప్రార్థిస్తాము. మనలో చాలా మందికి వారి పుట్టుక మరియు భౌతిక

Read More »