Hin

28th feb soul sustenance telugu

విజయానికి 8 శక్తులు (భాగం 2)

మీరు రోజును ప్రారంభించినప్పుడల్లా, చేయాల్సిన పని ఉన్నప్పుడు, వివిధ రకాల పరిస్థితులను అధిగమించి విజయాన్ని పొందడానికి ఎనిమిది ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించాలని గుర్తుచేసుకోండి. ఉదా. ఈ రోజు నేను కంపెనీ మీటింగ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల గ్రూప్ ను కలిసి అందరి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. దాని కోసం, పరిశీలన శక్తిని ఉపయోగించి వ్యక్తుల యొక్క భిన్న అభిప్రాయాలను ఆధారం చేసుకొని నిర్ణయం శక్తితో తుది నిర్ణయం తీసుకోవాలి. దీని కోసం నాకు స్వచ్ఛమైన బుద్ధి మరియు స్థిరమైన మనస్సు అవసరం. దానితో పాటు నిన్న చెప్పుకున్నట్లుగా ప్రత్యేకంగా ఈ రెండు శక్తుల సంస్కారాలు కూడా ఉండాలి. అలాగే, ఆఫీస్‌లోని నా సన్నిహితుడు సడన్ గా నాతో కోల్డ్ వార్‌ మొదలు పెడతాడు , అంటే అతను నాకు దూరం కావడం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితిలో, అతను నాతో మంచి సంబంధాలను తిరిగి కలిగి ఉండాలంటే, ఇతర శక్తులతో పాటుగా కొంతమేరకు సహయోగ శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి నాకు కావాలి. ఇవి కార్యాలయంలో రెండు విభిన్న పరిస్థితులకు ఉదాహరణలు.
కొన్ని సమయాల్లో శరీరం అనారోగ్యంతో బాధపడే పరిస్థితులు ఉంటాయి, దానితో మనస్సు భారంగా అయ్యి ముఖంలో చిరునవ్వు బదులుగా అసంతృప్తి మరియు ఉదాసీనతతో నిండి ఉంటుంది. శరీర సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నప్పుడు చాలా మందికి ఇది జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అవసరమైన ప్రాథమిక శక్తులు – ఎదుర్కొనే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి . అనారోగ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు మిగిలిన ఆరు శక్తులు కూడా తగ్గుతాయి. శారీరకంగా బాగాలేనప్పుడు సహించే శక్తి మరియు సహయోగ శక్తి తగ్గిపోయి చాలా తొందరగా ఆవేశం లేదా కోపం తెచ్చుకునే వారు కొందరు ఉంటారు. అలాగే, కొంతమంది అనారోగ్యంతో బాధపడేటప్పుడు మంచి చెడుల మధ్య పరిశీలించడం మరియు సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటుంది, ఇవి నిజ జీవిత పరిస్థితుల్లో విజయవంతం కావడానికి అవసరమైన రెండు ముఖ్యమైన శక్తులు. అలాగే అన్ని అనారోగ్య పరిస్థితులులో నెగెటివ్ ఆలోచనలు పెరిగి ఏకాగ్రతను కోల్పోయి , నిద్రలేమితో బాధపడతారు. అంటే అటువంటి పరిస్థితిలో సర్దుకునే శక్తి మరియు సంకీర్ణ శక్తి ప్రభావితం అవుతుందని దీని అర్థం.
(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »