28th january sst

విజయం మరియు దాని సరైన సారాంశం (భాగం- 2)

విజయం అనేది పాజిటివ్ సంఘటన లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం అని తప్పుగా నిర్వచించబడింది. మేము పరీక్షలో బాగా చేశామని లేదా మేము డిగ్రీని పొందామని లేదా మేము తీవ్రమైన అనారోగ్యాన్ని అధిగమించాము లేదా మేము ఉద్యోగంలో ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేసాము అని తరచుగా చెబుతాము. మన జీవితంలో ఇలాంటి ఏదైనా మంచి జరిగినప్పుడు ఇవన్నీ బాహ్య సంఘటనలు అని మనకు తెలుసు. అందువలన విజయం బయటి నుంచి వచ్చిందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మరోవైపు, మీరు అంతర్గతంగా శక్తివంతంగా, సంతృప్తిగా, ఆనందంగా మరియు సత్యతో నిండి ఉంటే మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే మన తెలివితేటలతో పాటు మన అంతర్గత మానసిక స్థితి, ఇతర ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాలు మరియు మన నైపుణ్యాలు కూడా మనకు విజయాన్ని అందిస్తాయి.

కొన్నిసార్లు మనకు కావలసిన నైపుణ్యాలు లేకపోవచ్చు లేదా ఆ పనికి సరిపోయే మంచి శారీరక వ్యక్తిత్వం ఉండకపోవచ్చు, అయినప్పటికీ మన అంతర్గత మానసిక స్థితి చాలా బాగున్న కారణంగా మనం ఆ పనిలో బాగా రానిస్తాము. ఎందుకంటే మీరు చాలా కష్టపడి పని చేయకపోయినా లేదా ఎక్కువ నైపుణ్యాలను ఉపయోగించకపోయినా, మీ ఆంతరిక స్థితి పనిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మరోవైపు, మన ఆంతరిక స్థితి కొన్నిసార్లు అంత సానుకూలంగా, స్పష్టంగా మరియు శక్తివంతంగా లేనప్పుడు లేదా మన మనసు వ్యర్థం మరియు నెగిటివ్ ఆలోచనలతో నిండినప్పుడు, మనం చాలా ప్రతిభావంతులు మరియు మంచి మేధో నైపుణ్యాలను కలిగి ఉన్నా ఏదో ఒక నిర్దిష్ట విషయంలో బాగా పని చేయలేము. అంటే జీవితంలో కార్య సాధనకు కేవలం నైపుణ్యాలు సరిపోవు. కాబట్టి, బాహ్యంగా మనం కలిగి ఉన్న విభిన్న సానుకూల నైపుణ్యాలు మరియు ప్రతిభ కంటే మన ఆలోచనా విధానం మరియు మన స్వభావంలో పాజిటివిటీ ద్వారా దీర్ఘకాలిక విజయం సాధించబడుతుంది.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

29th-sept-2023-soul-sustenance-telugu

పరిశీలన శక్తిని ఉపయోగించడం

మన జీవితం ఎలా జీవించాలనే మాన్యువల్‌తో రాదు. ప్రతిరోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.  మనకు ఉన్నతమైన వివేకం మరియు సరైన పరిశీలన శక్తి ఉండాలి. పరిశీలన శక్తి అంటే తప్పు ఒప్పులను,

Read More »
28th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 4)

మూడవ అద్దం మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యల అద్దం – మీ గురించి మరియు ఇతరుల గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఫీల్ అవుతున్నారో ఇతరులకు కనిపించదు కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది.

Read More »
27th-sept-2023-soul-sustenance-telugu

ఆంతరిక అందానికి 3 అద్దాలు (పార్ట్ 3)

గత రెండు రోజుల సందేశాలలో, అంతర్గత అందానికి మొదటి అద్దం – ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అద్దం గురించి మేము వివరించాము. రెండవ అద్దం మెడిటేషన్ యొక్క అద్దం – మెడిటేషన్ యొక్క నిశ్చలత

Read More »